తెలంగాణ బీజేపీ అభ్యర్దుల జాబితా విడుదల - లిస్టులో..!!
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 52 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించింది. ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ ను పోటీకి ఖరారు చేసింది. జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం కల్పించారు. అయితే, ఇందులో ఆశించినట్లుగా సీనియర్ల పేర్లను పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. మిగిలిన అభ్యర్దుల పేర్లతో రెండో జాబితాను దసరా తరువాత ప్రకటిస్తామని పార్టీ నేతలు వెల్లడించారు.
రెండు స్థానాల్లో ఈటల పోటీ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ తో పాటుగా గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ జాబితాలో బెల్లంపల్లి-శ్రీదేవి, సిర్‌పూర్- పాల్వాయి హరీశ్‌బాబు, గోషామహల్- రాజాసింగ్, దుబ్బాక- రఘునందన్‌రావు, కరీంనగర్-బండి సంజయ్, అదిలాబాద్- పాయల్ శంకర్, బోథ్(ఎస్టీ) సోయం బాపూరావు, నిర్మల్- ఏ.మహేశ్వర్‌రెడ్డి, ముథోల్ - రామారావు పాటిల్, ఆర్మూరు - పైడి రాకేశ్ రెడ్డి, జుక్కల్ - అరుణ తార, కామారెడ్డి - వెంకట రమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ - సూర్యనారాయణ గుప్తా, బాల్కొండ - ఆలేటి అన్నపూర్ణమ్మ, కోరట్ల - ధర్మపురి అర్వింద్ ను బరిలోకి దించారు. జగిత్యాల - డాక్టర్ భోగా శ్రావణి, ధర్మపురి - ఎస్ కుమార్, రామగుండం - సంధ్యారాణి, కరీం నగర్ నుంచి ఎంపి బండి సంజయ్ పేరు ఖరారు చేసారు.

కరీంనగర్ నుంచి బండి సంజయ్
చొప్పదండి - బాడిగ శోభ, సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి, మానకొండూరు - ఆరేపల్లి మోహన్, నర్సాపూర్ - మురళీ యాదవ్, పటాన్ చెరు - నందీశ్వర్ గౌడ్, దుబ్బాక - రఘునందన్ రావు, గజ్వేల్ - ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం- నోముల దయానంద్ గౌడ్, మహేశ్వరం - శ్రీరాములు యాదవ్, ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్ - అమర్ సింగ్, చార్మినార్ - మేఘారాణి, చాంద్రాయణ గుట్ట - సత్యనారాయణ ముదిరాజ్, యాకత్క్ పూరా- వీరేంద్ర యాదవ్, బహదూర్ పూరా - నరేశ్ కుమార్, కొల్లాపూర్ - సుధాకర రావు, నాగార్జున సాగర్ - నివేదిత రెడ్డి, సూర్యాపేట - సంకినేని వేంకటేశ్వర రావు, భువనగిరి - గూడూరు నారాయణ రెడ్డి పేర్లు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న బిజెపి అభ్యర్థుల తొలి జాబితా.#TelanganaWithBJP pic.twitter.com/oUU6NdhizN
— BJP Telangana (@BJP4Telangana) October 22, 2023
రెండు రోజుల్లో రెండో జాబితా
తుంగతుర్తి - కడియం రామచంద్రయ్య, జనగాం - ఆరుట్ల ధశమంత్ రెడ్డి, స్టేషన్ గణపూర్ - జీ విజయరామారావు, పాలకుర్తి - రామ మోహన రెడ్డి, డోర్నకల్ - భూక్యా సంగీత, మహబూబాబాద్ - హుస్సేన్ నాయక్, వరంగల్ వెస్ట్ - రావు పద్మా, వరంగల్ ఈస్ట్ - ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వర్దన్నపేట - కొండేటి శ్రీధర్, భూపాలపల్లి - చందుపట్ల కీర్తిరెడ్డి, యల్లందు - రవీంద్ర నాయక్, భద్రాచలం - ధర్మారావు పేర్లను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.
అయితే, కామారెడ్డి నుంచి విజయశాంతి సీఎం కేసీఆర్ పైన పోటీ చేస్తారని ప్రకటించినా..అక్కడ నుంచి వెంకట రమణా రెడ్డిని ఖరారు చేసారు. ఈ లిస్టులో పార్టీలో సీనియర్లకు పెద్దగా అవకాశం కల్పించలేదు. మరో రెండు రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల అభ్యర్దులను ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications