రాజా సింగ్‌కు టఫ్ టాస్క్: తెలంగాణలో బీజేపీ లోక్‌సభ ఇన్‌ఛార్జీలు వీళ్లే..

Lok Sabha elections 2024: సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో రెండు నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ.. తన పట్టును నిలుపుకొనే ప్రయత్నాల్లో ఉంది.

ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించాలని భావిస్తోన్నాయి. దీనికి అవసరమైన కసరత్తును మొదలుపెట్టాయి కూడా. ఇప్పటికే బీఆర్ఎస్ లోక్‌సభ నియోజకవర్గాలవారీగా సమీక్ష సమావేశాలను చేపట్టింది. బీజేపీ అదే దారిలో సాగుతోంది.

BJP appointed Lok Sabha political incharges in Telangana

17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. మొత్తం తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకూ రాజకీయ ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. శాసన సభ, శాసన మండలి సభ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ స్థితిగతులపై అధ్యయనం చేయడం, సమర్థుడైన అభ్యర్థి పేరును వాళ్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.

ఎమ్మెల్యేలు పాయల్ శంకర్- ఆదిలాబాద్, రామారావు పవార్- పెద్దపల్లి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా- కరీంనగర్, ఆలేటి మహేశ్వర్ రెడ్డి- నిజామాబాద్, కే వెంకట రమణ రెడ్డి- జహీరాబాద్, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు- మెదక్, పైడి రాకేష్ రెడ్డి- మల్కాజ్‌గిరి ఇన్‌ఛార్జీలుగా అపాయింట్ అయ్యారు.

రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌కు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని అప్పగించింది. గోషా మహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్‌ను హైదరాబాద్ లోక్‌సభ ఇన్‌ఛార్జీ బాధ్యతలను ఇచ్చింది. చేవెళ్ల స్థానానికి ఇన్‌ఛార్జీగా శాసన మండలి సభ్యుడు ఏ వెంకటనారాయణ రెడ్డిని నియమించింది బీజేపీ.

మాజీ ఎమ్మెల్సీలు ఎన్ రామచందర్ రావు- మహబూబ్ నగర్, మారం రంగారెడ్డి- నాగర్ కర్నూల్, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి- నల్లగొండ, ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్- భువనగిరి, మర్రి శశిధర్ రెడ్డి- వరంగల్, గరికపాటి మోహన్ రావు- మహబూబాబాద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి- ఖమ్మం ఇన్‌ఛార్జీలుగా నియమితులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+