హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సెంటిమెంట్‌తో మరలా కుట్ర‌లు.. కేసీఆర్ గ‌ద్దెదించుతాం ! : బండి సంజయ్ వార్నింగ్‌

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. దొర పాలనతో తెలంగాణ తల్లి తల్లడిల్లుతోందన్నారు. అవినీతిలో కల్వకుంట్ల వారి కుటుంబం కూరుకుపోయిందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో నలిగిపోతుందని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సంతోషంగా ఉంది ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమేన‌న్నారు. ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు.

అవినీతిలో కల్వ‌కుంట్ల కుటుంబం టాప్‌

అవినీతిలో కల్వ‌కుంట్ల కుటుంబం టాప్‌


తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని బండి సంజయ్ దయ్యబట్టారు. ప్రజలను మోసం చేసిన పబ్బంగడుపతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల అవినీతి బయటపెడతామని హెచ్చరించారు. జైలుకు పంపించే వరకు తమ పోరాటం సాగుతుందని తెలిపారు. ప్రవాస భారతీయులతో జరిగిన జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయ‌న టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ పాలన రోజులు దగ్గర పడ్డాయన్నారు.

 తెలంగాణ సెంటిమెంటుతో కుట్ర‌..

తెలంగాణ సెంటిమెంటుతో కుట్ర‌..


వడ్ల కొనుగోలు చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రాన్ని బదనాం చేస్తున్నారని బండి సంజయ్ దయ్యబట్టారు. తెలంగాణ సెంటుమెంటును మరలా రగిలించి.. రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలు, కుట్రలు చేసినా ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గులాబీ బాస్ ఎత్తులు ఇక సాగవని హెచ్చరించారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమన్నారు. అందుకు ప్రజలందరూ సహకరించాలని బండి సంజయ్ కోరారు.

కేసీఆర్‌ను గ‌ద్దె దించుతాం..

కేసీఆర్‌ను గ‌ద్దె దించుతాం..


రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. గోల్కొండ కోటపై కమలం జెండా ఎగురేసి తీరుతామ‌ని స్పష్టం చేశారు. కేసీఆర్ చేతిలో తల్లడిల్లుతున్న తెలంగాణ తల్లిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఎంత మంది పీకేలను తెచ్చుకున్నా .. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతే ఇందుకు నిదర్శమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అని స్పష్టం చేశారు. ప్ర‌జ‌ల న‌డ్డివిరిచేలా కరెంట్, బ‌స్ చార్జీల‌ను పెంచిందన్నారు. కేసీఆర్ అస‌మ‌ర్థ‌పు పాల‌న‌పై త‌మ పోరాటాన్ని మ‌రింత ఉద్ధృతం చేస్తామ‌ని హెచ్చిరించారు.

English summary
Bandi Sanjay says KCR family top with corruption
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X