ఆ నిబంధనల ఉల్లంఘన; మంత్రి కేటీఆర్ పై, గులాబీనేతలపై నల్గొండ ఎస్పీకి బీజేపీ ఫిర్యాదు

ఇటీవల నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలోనూ, ఐటి హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై నల్గొండ బిజెపి నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ కార్యక్రమంలో నిబంధనలు పాటించలేదని, ఇష్టారాజ్యంగా కార్యక్రమాలను నిర్వహించారని వారు పేర్కొన్నారు. మంత్రుల పర్యటన లో జీవో 327 ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు డా. జి. మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కోవిడ్ నియమాలను పాటించని కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోండి : బీజేపీ

కోవిడ్ నియమాలను పాటించని కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోండి : బీజేపీ

నల్గొండ పట్టణంలో మంత్రుల పర్యటన సందర్భంలో జీవో 327 కు విరుద్ధంగా వ్యవహరించారని, కోవిడ్ నియమాలను పాటించకుండా ర్యాలీ, బహిరంగ సభలు నిర్వహించినందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యలయంలో మీడియా సమావేశం లో మాట్లాడిన ఆయన జీవో 327విడుదల ప్రతి పక్షాలు నిర్వహించే సమావేశాలకేనా? అధికార పార్టీ సమావేశాలకు, ర్యాలీలకు వర్తించదా? అని ప్రశ్నించారు.

ప్రతిపక్షాలకు జీవో సాకు .. అధికార పార్టీకి వర్తించదా? ఫైర్ అయిన బీజేపీ నేతలు

ప్రతిపక్షాలకు జీవో సాకు .. అధికార పార్టీకి వర్తించదా? ఫైర్ అయిన బీజేపీ నేతలు

రాష్ట్రంలోఒమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో, ఒమిక్రాన్ కేసులు పెరగకుండా జనవరి 2 వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించ కూడదని డిసెంబర్ 25న జీవో 327ను విడుదల చేశారని, ఈ జీవో అధికార పార్టీకి వర్తించదా అని ప్రశ్నిచారు.బీజేపీ నాయకులు నిరుద్యోగ దీక్ష కు అనుమతి కోరితే జీవో పేరు చెప్పి అనుమతులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకపోవడంతో పరిమిత సంఖ్యలోరాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్షను నిర్వహించామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశాలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందుతుంది. కానీ అధికార పార్టీ సమావేశాలను నిర్వహిస్తే కరోనా వ్యాప్తి జరగదా అంటూ ప్రశ్నించారు.

 డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ ల పై కేసులు పెట్టాలని డిమాండ్

డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ ల పై కేసులు పెట్టాలని డిమాండ్


ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి సంబంధించి జిల్లా ఎస్పీకి, కలెక్టర్ కు పంపించామని బిజెపి నాయకులు పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాలతో జిల్లాలో మరింత కేసులు పెరిగే అవకాశం ఉందని బిజెపి నాయకులు ఆరోపించారు. ఒకపక్క జాగ్రత్త వహించాలని చెబుతూనే మరోపక్క అధికార పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జీవో 327ను ఉల్లంఘించి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించినందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం మంత్రులు,ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ ల పై కేసులు పెట్టాలని నల్గొండ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

నల్గొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

నల్గొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

మాస్కులు పెట్టుకోకుండా టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వెయ్యి రూపాయల జరిమాన విధించాలని డిమాండ్ చేశారు.చర్యలు తీసుకోవాలనిజిల్లాఎస్పీ రెమా రాజేశ్వరి ని కలిసి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై, టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు నమోదు చేయాలని ఎస్పీని కలిసిన వారిలోబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి , స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ గార్లపాటి జితేంద్ర కుమార్, పోతేపాక సాంబయ్య , పాలకూరి రవి గౌడ్, బొజ్జ శేఖర్, దాయం భూపాల్ రెడ్డి ,దాసరి సాయి,మధు తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+