తెలంగాణలో ఆ ఇద్దరూ సీన్ మార్చేస్తారా - కీలక మలుపు..!!

తెలంగాణలో ఎన్నికల రాజకీయం కీలక మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు మూడు ప్రధాన పార్టీలు తాము గెలిచే సీట్ల పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ సీట్లు విషయంలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవటం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేసీఆర్ బస్సుయాత్ర చేస్తున్నారు. బీజేపీ సైతం తామ అధిక సీట్లు గెలుస్తామని చెబుతోంది.ఈ సమయంలోనే తెలంగాణలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

హోరా హోరా పోరు
తెలంగాణలో ఈ సారి ఎన్నికలు హోరా హోరీగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అదిలాబాద్ లోప్రచారం కోసం నిర్మల్ చేరుకున్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ తోపాటు అన్ని పార్టీలకు చెందిన అతిరథ మహారధులు తెలంగాణలో అడుగు పెడుతున్నారు.మే నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు వేములవాడ, పదిన్నరకు వరంగల్ జిల్లా మడికొండలో పర్యటిస్తారు.

BJP-Congress Key leaders campaign in Telangana leads new turn in key contest

బీజేపీ, కాంగ్రెస్ నేతల రాక
పదవ తేదీ మరోసారి ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట, సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. ఈ మధ్నాహ్నం అమిత్ షా కాగజ్‌నగర్‌లో జరిగే ఆదిలాబాద్ జనసభలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు నిజామాబాద్‌ గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రసంగిస్తారు. సాయంత్రం హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో అమిత్‌షా సభ ఉండబోతోంది. దీంతో భారీగా జన సమీకరణతో సభ విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమిత్‌షా అలా వెళ్లిపోగానే, సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ చేరుకుంటారు.

మెజార్టీ సీట్ల పై గురి
పెద్దపల్లి, భువనగిరి, నల్గొండల్లో పర్యటిస్తారు. వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోల్లో పాల్గొంటారు. ప్రియాంకగాంధీ ఇవాళ నిర్మల్, గద్వాల్‌ నియోజకవర్గాల్లో నిర్వహించే పబ్లిక్‌ మీటింగ్స్‌లో పాల్గొంటారు. మళ్లీ తొమ్మిదో తేదీన తెలంగాణకు తిరిగొచ్చు, కరీంనగర్‌, సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు రాహుల్‌గాంధీ హాజరవుతారు. ఇదే గ్యాప్‌లో ప్రియాంకగాంధీ కూడా సోమవారం తెలంగాణకు వస్తున్నారు. ఎల్లారెడ్డి, తాండూరులో పర్యటించి అదేరోజు సికింద్రాబాద్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. మే ఏడవ తేదీన నర్సాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. దీంతో..ముఖ్య నేతల ప్రచారంతో తెలంగాణలో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+