KTR: సుద్దపూస ఇప్పుడు ఏమంటారో... కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై బండి సంజయ్.. !
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో పోలీసులు, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న ఫామ్ హౌస్ నుంచి భారీగా శబ్దాలు వచ్చాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు దాడులు చేశారు. ఫామ్ హౌస్ లో భారీగా డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు ఉన్నట్లు తెలిసింది. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ జరిగిన రేవ్ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు
పాల్గొన్నట్లు సమాచారం.
ఎక్సైజ్ శాఖ అనుమతి లేని 10.లీటర్ల ఫారిన్ లిక్కర్(7 బాటిళ్లు)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు పోలీసులు సైఫర్ డాగ్స్ తో గాలించారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అతను కొకెయిన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఆ వ్యక్తిపై NDPD యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. నిందితులపై సెక్షన్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు.

విజయ్ ముద్దార్ కు డ్రగ్స్ పాజిటివ్ గా తేలిందని తెలుస్తోంది. జన్వాడ ఫామ్ హోస్ అనుమతి లేకుండా నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయమై పోలీసులు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. సాయంత్రం వరకు ఫామ్ హౌస్ ను సీజ్ చేసే అవకాశం ఉంది. కాగా ఈ ఘటనపై కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వాడకంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎంత పెద్దవారు ఉన్నా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ సీసీ కెమెరా దృశ్యాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు. సుద్దపూస ఇప్పుడు ఏమంటారో అని కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు.
Congress govt in Telangana is just pretending to enforce the law but is actually protecting the BRS bigwigs.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 27, 2024
The raid at Janwada farmhouse is merely tip of the iceberg.
A proper search would reveal the truth - even a novice knows drugs don’t simply vanish.
Congress govt… pic.twitter.com/89HsBdpxQi
ఫామ్ హౌస్ కు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను బయట పెట్టాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. వీకెండ్ వచ్చిందంటే.. విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం పెరిగిందని అన్నారు. ఈ వ్యవహారం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రముఖులను తప్పించాలని పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు. డీజీపీ దీనిపై సమాధానం చెప్పాలన్నారు. రేవ్ పార్టీ సంస్కృతి పెరుగుతోందని అన్నారు. భాగ్యనగరంలో డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారని ఆరోపించారు. ఇప్పటికే పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ పార్టీకీ ఇప్పుడు ఇది పెద్ద దెబ్బగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications