వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెప్టెంబర్ 17కు సెంటిమెంట్ అడ్డా, సవాల్ చేస్తున్నా రా: కెసిఆర్‌కు కిషన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలంటూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద భారతీయ జనతా పార్టీ నేతలు మంగళవారం ఆందోళన చేపట్టారు.

ఇందిరా పార్క్ నుంచి సచివాలయ ముట్టడికి ప్రదర్శనగా బయలుదేరారు. ఈ సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రేపు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము అన్ని ప్రభుత్వ కార్యాలయాల పైన జాతీయ పతకాలు ఎగరేస్తామన్నారు.

బిజెపి

బిజెపి

మంగళవారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్నారు.

బిజెపి

బిజెపి

గతంలో అధికారికంగా నిర్వహించాలని చెప్పిన కెసిఆర్, అధికారంలోకి వచ్చాక ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.

 బిజెపి

బిజెపి

నైజాం పాలనలోప్రజలు అనేక రకాలుగా దోపిడీకు గురయ్యారని, మహిళలు హింసలకు గురయ్యారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

 బిజెపి

బిజెపి

విద్యకు కూడా దూరమయ్యారన్నారు. కెసిఆర్ సెప్టెంబర్ 17న సెంటిమెంట్ అడ్డు వస్తుందనడం విడ్డూరమని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దీని పైన బహిరంగ చర్చకు సిద్ధమా అన్నారు.

 బిజెపి

బిజెపి

ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుంటే ఉద్యమాన్ని చేపడతామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

 బిజెపి

బిజెపి

నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కావాలో లేక మజ్లిస్ పార్టీ మెప్పు కావాలో కెసిఆర్ తేల్చుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

 బిజెపి

బిజెపి

రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వచ్చి విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.

 బిజెపి

బిజెపి

తెలంగాణ సమాజాన్ని అవమానించేలా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.

English summary
The Police on Tuesday arrested BJP state president Kishan Reddy and several other leaders when they tried to march towards the Secretariat from Indira park demanding the State Government to celebrate Telangana Liberation day on September 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X