బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగమే.. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఏపీకి??
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు భారతీయ జనతాపార్టీ సెగ తగిలింది. 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడును ఓడించడానికి ఏ తరహా వ్యూహాలు అమలు చేశారో అదే తరహా వ్యూహాలను ఇప్పుడు తెలంగాణలోను పునరావృతం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో సోమేష్‌కుమార్‌ను ఏపీకి కేటాయించారు. సెంట్రల్ అడ్మనిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తర్వాత తెలంగాణ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ఆయనకన్నా సీనియర్లు ఉన్నప్పటికీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ సోమేష్ కుమార్‌ను ఏరికోరి తెచ్చుకున్నారు. అయితే ఆయన వ్యవహారశైలిపై రాష్ట్ర బీజేపీ నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా హైకోర్టులో సీఎస్‌కు సంబంధించి జరిగిన వాదనల్లో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. ఆయన్ని ఏపీకి పంపించాలంటూ స్పష్టమైన అభిప్రాయాన్నితెలియజేసింది. హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.

తెలంగాణ సీఎస్ ఒకవేళ ఏపీకి వెళ్లాల్సి వస్తే ఇప్పుడున్న క్యాడర్‌లో పదవి దక్కదు. ఈ పరిణామం కేసీఆర్‌కు బాగా ఇబ్బందికరమని రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలయ్యేంతవరకు సోమేషే సీఎస్‌గా ఉండేలా ముందే ఆయన జాగ్రత్తపడ్డారు. అనుకోని రీతిలో ఇప్పుడు ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. రానున్న రోజుల్లో భారతీయ జనతాపార్టీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఎత్తులు వేస్తుంది? వాటిని ఎలా చిత్తుచేయాలి? అన్న విషయమే తెలంగాణ రాజకీయాలను హాట్‌హాట్‌గా ఉంచబోతున్నాయి.












Click it and Unblock the Notifications