టీఆర్‌ఎస్‌ ట్రాప్‌లో బీజేపీ - తాజా సర్వేలో షాకింగ్ రిపోర్ట్..!!

మునుగోడు ఉప ఎన్నిక వేళ..ప్రధాన పార్టీలు మైండ్ గేమ్ మొదలు పెట్టాయి. తమ ప్రచారం కంటే..ప్రత్యర్ధి పార్టీలను ఢిఫెన్స్ లో పడేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందులో భాగంగా.. ఇప్పుడు బీజేపీ లక్ష్యంగా అటు టీఆర్ఎస్ - ఇటు కాంగ్రెస్ ఒకే రకమైన ప్రచారం చేస్తున్నాయి. బీజేపి తెలంగాణ నేతలు టీఆర్ఎస్ ట్రాప్ లో చిక్కుకుంటున్నట్లుగా ఢిల్లీ నేతలు గుర్తించారు. వెంటనే బీజేపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఎదురుదాడి ప్రారంభించాలని నిర్దేశించారు. టీఆర్ఎస్ ట్రాప్ లో చిక్కుకోవద్దంటూ సూచించారు.

మునుగోడు ప్రచారంలో కేంద్ర మంత్రులు

మునుగోడు ప్రచారంలో కేంద్ర మంత్రులు

మునుగోడులో బీజేపీ అభ్యర్ధి గెలుపు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆ పార్టీ నేతలు కేంద్ర మంత్రులను రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం ఐదుగురు కేంద్ర మంత్రులు పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గానికి చెందిన కేంద్ర మంత్రులు మునుగోడుకు రానున్నారు. సామాజిక వర్గాల వారీ సమావేశాలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రెండురోజుల క్రితం కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌.. చౌటుప్పల్‌లో గొల్ల కురుమలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వచ్చే పక్షం రోజుల్లో మరో ఐదారుగురు కేంద్ర మంత్రులు మునుగోడుకు రానున్నారు. ఇదే సమయంలో ఆయా సామాజికవర్గాలకు చెందిన బీజేపీ రాష్ట్ర నేతలు కూడా ఆత్మీయ సమ్మేళనాలకు హాజరుకానున్నారు. ప్రస్తుతం గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ పైన బీజేపీ అధినాయకత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది.

ఢిఫెన్స్ కాదు - ఎటాకింగ్ చేయాలి

ఢిఫెన్స్ కాదు - ఎటాకింగ్ చేయాలి

అయినా..మునుగోడుకు అమిత్ షా వచ్చే అవకాశం ఉందని చెబుుతున్నారు. ఈ నెలాఖరులో అమిత్ షా పర్యటన ఉంటుందని..తేదీ ఫిక్స్ అయితే బహిరంగ సభ నిర్వహిస్తామంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 16 నుంచి మునుగోడు నియోజకవర్గంలో విస్తృత ప్రచారంలో పాల్గొంటారు. అవసరాన్ని బట్టి ఈలోపు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తారు. చండూరు, చౌటుప్పల్‌లో ఆయన మకాం వేయనున్నారు. కొంతమంది సీనియర్‌ నేతలు ఒక్కో మండలంలో మాత్రమే ప్రచారం చేయనుండగా, మరికొందరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ కావాలనే వ్యక్తిగత విమర్శలు చేస్తోందని, తద్వారా నియోజకవర్గంలో అభివృద్ధి అంశాన్ని తెరమరుగు చేసేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ నాయకత్వం స్థానిక నేతలకు వివరించింది. టీఆర్‌ఎస్‌ ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా ప్రచారం కొనసాగాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్గనిర్దేశం చేసింది.

సర్వే నివేదికలతో కలవరం

సర్వే నివేదికలతో కలవరం

మునుగోడు కేంద్రంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రచారం ఉండాలని సూచించింది. ఇక, తాజాగా మునుగోడుకు సంబంధించి ప్రధాన పార్టీలు చేయించిన సర్వేల్లో షాకింగ్ ఫలితాలు వెల్లడయినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకూ అధికార టీఆర్ఎస్ - బీజేపీ రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నట్లుగా ప్రచారం చేసుకున్నాయి. కానీ, టీఆర్ఎస్ గత నెలలో చేయించిన సర్వే కంటే తాజా సర్వే లో అనుకూలత శాతం తగ్గినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీకి సైతం గతం కంటే సానుకూలత పెద్దగా పెరిగినట్లుగా ఎక్కడా కనిపించటం లేదని తేలినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నంత బలహీనంగా లేదని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, టీఆర్ఎస్ - బీజేపీ మధ్య తేడా చాలా తక్కువగా ఉండటంతో..ఎన్నికల సమయం నాటికి ఎవరికి అయినా అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో..రెండు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు మునుగోడు కేంద్రంగా మొహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+