అది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.!ప్రజల పాలిట ట్రబుల్ ఇంజన్ సర్కార్.!బీజేపిని తరిమికొట్టాలన్నహరీష్ రావు.!
సంగారెడ్డి/హైదరాబాద్: సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు. భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదని, తెలంగాణలో అది సీఎం చంద్రశేఖర్ రావు మాత్రమే ఇస్తున్నరని గుర్తు చేసారు. సంగారెడ్డిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గిని ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రశంసించారు. బీజేపి దేశానికి ఏంచేసిందని, బీజేపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ, ట్రబుల్ ఇంజన్ సర్కారు వైపు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నరని, జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు మంత్రి హరీష్ రావు.

సంగారెడ్డిలో పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వ పధకాలను ప్రశంసించిన మంత్రి హరీష్
సంగారెడ్డికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని, అది డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కదా అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు. బీజేపీ అక్కడ ఇచ్చే పెన్షన్ కేవలం 600 రూ మాత్రమేనని అన్నారు. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తమని సీఎం చంద్రశేఖర్ రావు చెప్పారని, ఇప్పుడు ఆ పెన్షన్లు ఇస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చాక సంగారెడ్డిలో లక్షా 5వేల పెన్షన్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు మరో 66 వేల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసామన్నారు హరీష్ రావు. ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు, బీడీ కార్మికులు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం లేదు, కాని తెలంగాణ ప్రభుత్వం వారికి పెన్షన్లు ఇస్తుందని మంత్రి హరీష్ రావు గుర్తు చేసారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్ 600 లే.. 2016 రూ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న హరీష్
అంతే కాకుండా కాంగ్రెస్ హయాంలో 25 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే, తెలంగాణ వచ్చాక సీఎం చంద్రశేఖర్ రావు 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నరన్నారు హరీష్ రావు. ఏడాదికి 12 వేల కోట్లు, నెలకు వేయి కోట్లు ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వ ఖర్చు చేస్తోందన్నారు. పేదవాడికి పది కేజీల బియ్యం, 2016 పెన్షన్ ఇచ్చేది వారు ఆత్మగౌరవంగా బతకడానికన్నారు మంత్రి హరీష్ రావు. కాని బీజేపీ ఉచితాలు అనుచితమని అంటోందని, బడా కంపెనీలకు 12 లక్షల కోట్లు ఖర్చు చేసిన బీజేపీ ప్రభుత్వం, రెక్కాడితే డొక్కాడని పేదలకు పెన్షన్లు ఇస్తే ఉచితాలు, అనుచితమని అంటోందని, నాలుగొందలున్న గ్యాస్ సిలిండర్ ధరను 1200 కు పెంచిందని, పెట్రోల్, డిజీల్ ధరలు అసాధారణంగా పెంచిందని మంత్రి హరీష్ రావు బీజేపి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు.. ఇందుకు ఏటా 12 వేల కోట్లు చేస్తున్నామన్న హరీష్ రావు..
టీఆర్ఎస్ పేద ప్రజలకు పంచే కార్యక్రమం పెడితే, బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్లకు లక్షల కోట్లు పంచి పెడుతుందని ఎద్దేవా చేసారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు కాన్పుకెళితే 12 వేల రూపాయల సాయం, కేసీఆర్ కిట్, మంచి బోజనం పెట్టి, ఆటో కిరాయి ఇచ్చి ఇంటి దగ్గర దింపుతున్నామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతు బీమా, రెండు పంటలకు పది వేల రైతు బంధు సాయం చేస్తున్నామన్నారు. గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఇంతకు ముందే నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు గ్రూప్-2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి అనుమతులిచ్చామని, రాబోయే 2-3 రోజుల్లో 9 వేల గ్రూప్ -4 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నామన్నారు మంత్రి హరీష్ రావు.

80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ.. బీజేపి హయాంలో నిరుద్యోగం తాండవిస్తోందన్న మంత్రి హరీష్ రావు.
అంతే కాకుండా సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించినట్టు 91 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్నారు హరీష్ రావు. వందకు వంద శాతం ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 11 వేల కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ చేస్తామని, మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోందన్నారు. మొత్తం మీద 2 లక్షల 10 ఉద్యోగాలు నిరుద్యోగులకు అందిస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏం చెప్పిందని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపి 8ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుందని, బీజేపికి సరైన గుణపాఠం నేర్పాలన్నారు మంత్రి హరీష్ రావు.












Click it and Unblock the Notifications