అదుపు తప్పి బోల్తా కొట్టిన కిషన్ రెడ్డి వాహనం.. డ్రైవర్, పీఏకు గాయాలు

రీంగనర్ జిల్లాలో బొగ్గు బావుల పర్యటనకు వెళ్లిన కిషన్ రెడ్డి.. పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కరీంనగర్: బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్‌ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాద సమయంలో ఆయన వేరొక వాహనంలో ఉండటంతో ఆయన క్షేమంగానే ఉన్నారు. ప్రమాదానికి గురైన వాహనంలో డ్రైవర్, కిషన్ రెడ్డి పీఏ సహా మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టడంతో అందులో ఉన్నవారు గాయలపాలయ్యారు.

BJP Kishan Reddys vehicle met with an accident

కాగా, కరీంగనర్ జిల్లాలో బొగ్గు బావుల పర్యటనకు వెళ్లిన కిషన్ రెడ్డి.. పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజబొల్లారం తండా వద్ద లారీని తప్పించబోయే క్రమంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. కిషన్ రెడ్డి కొంతమంది ఆయన అనుచరులు కలిసి వారిని ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+