బండి సంజయ్ భావోద్వేగం: చివరి శ్వాస వరకు..!!
Bandi Sanjay: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో వివిధ సంస్థలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ వివరాలు అందుతున్నాయి.
తెలంగాణపై ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ (India TV-CNX) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls)లో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ- అధికార భారత్ రాష్ట్ర సమితికి నిరాశ తప్పదని తేల్చిందీ సర్వే. కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపింది. హస్తం పార్టీకి భారీ సంఖ్యలో సీట్లను గెలుస్తుందని అంచనా వేసింది.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం.. 60. బీఆర్ఎస్ ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోలేదని అంచనా వేసింది. 31 నుంచి 47 స్థానాలకే పరిమితమౌతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం అసాధ్యమని వివరించింది.
మూడోసారి అధికారంలోకి రావాలనే బీఆర్ఎస్ ఆశలు ఏవీ ఫలించబోవని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ (India TV- CNX exit polls on Telangana) ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగురకపోవచ్చని, కారు జోరు తగ్గుతుందని వివరించింది.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి మోజారిటీని సాధిస్తుందని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ తెలిపింది. ఏకంగా 63 నుంచి 79 స్థానాలతో హస్తం పార్టీ జెండా ఎగురవేస్తుందని తేల్చింది. బీజేపీకి రెండు నాలుగు సీట్లకే పరిమితమౌతుంది. అఖిల భారత్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు అయిదు నుంచి ఏడు సీట్లు దక్కుతాయి.
ఇదొక్కటనే కాదు.. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీకి అనుకూలంగా వెలువడలేదు. పట్టుమని పది సీట్లు కూడా బీజేపీ దక్కించుకోలేదని తేల్చి చెప్పాయి. కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొని ఉంటుందని స్పష్టం చేశాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి.
ఈ పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ (Bandi Sanjay) తెర మీదికి వచ్చారు. ఎగ్జిట్ పోల్స్‌పై తన స్పందన తెలియజేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌పై ఓ పోస్ట్ పెట్టారు. భావోద్వేగానికి గురయ్యారాయన.
కాషాయ విజయమే లక్ష్యంగా తమ వ్యాపారాలను, ఉద్యోగాలను, కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి అహర్నిశలు కష్టపడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వెన్నంటి నడిచిన యువకులు, జాతీయవాదులు, శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా ధన్యవాదాలను తెలియజేస్తోన్నానని అన్నారు. తమ పవిత్రమైన ఓటుతో కరీంనగర్‌లో కమల వికాసానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రగతి, సంక్షేమం కోసం జరిగిన శాసనసభ ఎన్నికల అంకం చివరి వరకు తమ అమూల్యమైన సేవలను అందించిన ఎన్నికల నిర్వహణ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, మీడియాకూ ధన్యవాదములు తెలిపారు. తన చివరి శ్వాస వరకు నాయకులు, కార్యకర్తలతోనే ఉంటానని హామీ ఇచ్చారు బండి సంజయ్. భారత్ మాతాకీ జై అంటూ తన ట్వీట్‌ను ముగించారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications