కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ!
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఆయన తాజాగా సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే.. కాంగ్రెస్ పార్టీని ఆకాశానికెత్తేస్తున్నారు. గత కొంత కాలంగా రాజకీయాల్లో అంత చురుగ్గా లేని జిట్టా బాలకృష్ణ.. తాజాగా, సొంత పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు.
తాను మానసికంగా ఎప్పుడో బీజేపీకి దూరమయ్యానని, కార్యకర్తగా మాత్రమే ఉన్నానని జిట్టా బాలకృష్ణ చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తానని తాను బీజేపీలో చేరానని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఆకాంక్ష బీజేపీతో నెరవేరని అర్థమైందన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు.

బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం హీనమైన చర్య అని జిట్టా బాలకృష్ణ అని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. గత 16 నెలలుగా బీజేపీలో ఉన్నా.. తనను ఏ ఒక్క కార్యక్రమం చేయనివ్వలేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేయడం లేదని అన్నారు.
తనతో చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా తనతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ముగ్గురు రియల్టర్ చేతుల్లోనే భువనగిరి రాజకీయాలు ఉన్నాయన్నారు జిట్లా బాలకృష్ణ. మూడు పార్టీల అధ్యక్షులు బెంగళూరు బ్రదర్స్ అంటూ ఆరోపించారు. భునగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నిందించే స్థాయి కుంభం అనిల్‌కు లేదని అన్నారు.
కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలంటే.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు జిట్టా బాలృష్ణ. తనను చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అడుగుతున్నారని.. కార్యకర్తలతో సమావేశమైన తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని బాలకృష్ణ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ బీజేపీ నేత త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీలో చేరికలు పెరిగాయి. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. త్వరలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ఆ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సభలో ఆయన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications