లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన రఘునందన్ రావు
హైదరాబాద్: తనపై ఓ మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ కీలక నేత రఘునందన్ రావు స్పందించారు. బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు..
ఈ నేపథ్యంలో సదరు మహిళ చేస్తున్న ఆరోపణలు నూటికి నూరు శాతం అవాస్తవమని ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తనకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. తాను ఏ నేరం చేయలేదని చెప్పారు. ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తెలియదని చెప్పారు. పూర్తి వివరాలు తెసుకున్నాక దీనిపై స్పందిస్తానని రఘునందన్ రావు తెలిపారు.

కాఫీ మత్తుమందు కలిపి..
కాగా, రఘునందన్ రావు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సోమవారం రాధారమణి అనే మహిళ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది.
2007లో రఘునందన్ రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక, తనకు అతని నుంచి ప్రాణహాని కూడా ఉందని అన్నారు.

అశ్లీల ఫొటోలతో బెదిరింపులు..
ఇంకా ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఆర్సీపురంలో రాధారమణి దంపతులు ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భర్తతో విభేదాలు రావడంతో 2003లో ఇంటినుంచి బయటకొచ్చారు. అయితే భృతి ఇప్పించేందుకు 2007లో స్థానిక అడ్వకేట్ రఘునందన్‌ను ఆశ్రయించారు. అలా ఓ సారి ఆఫీసుకు వెళ్లిన రాధారమణికి కాఫీలో మత్తుమందు కలిపి లైంగికదాడి చేశారని ఆరోపించారు. అంతేకాదు ఆశ్లీల ఫోటోలు ఉన్నాయని చెప్పి.. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని రాధారమణి చెప్పారు. అలా చెప్పినట్టు చేసుకుంటూ వచ్చానని పేర్కొంది.

పోలీసులకు ఫిర్యాదు..
వేధింపులు తాళలేక మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదించానని తెలిపింది. వారి సూచన మేరకు ఆర్సీ పురం పీఎస్‌లో ఫిర్యాదు చేశానని వివరించారు. తాజాగా కేసు విత్ డ్రా చేసుకోవాలని తనను బెదిరిస్తున్నారని రాధారమణి తెలిపింది. తనను రఘునందన్ కిడ్నాప్ కూడా చేశాడని, ఇందుకు తన భర్త కూడా సహకరిచాడని ఆరోపించింది. సదరు మహిళ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications