వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ అలా చేసుంటే మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోయేదా? గుజరాత్ నుంచి డబ్బులా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మునుగోడు విజయం మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. తమపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కోట్లు బదిలీ అంటూ కేటీఆర్.. నిజం లేదన్న వివేక్

కోట్లు బదిలీ అంటూ కేటీఆర్.. నిజం లేదన్న వివేక్

హైదరాబాద్ కోకాపేటలో తమ కంపెనీ కోసం ల్యాండ్ కొనుగోలు చేస్తే.. హవాలా లావాదేవీలు జరిగాయాంటూ కేటీఆర్ తప్పుడు ప్రకటన చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక్. కంపెనీ కోసం తాము భూమి కొనగడం తప్పా? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తాను డబ్బులు ఇచ్చానని కేటీఆర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. గతంలో
జమునా హేచరీస్ పైనా కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. గుజరాత్ నుంచి తనకు రెండున్నర కోట్లు వచ్చాయని కేటీఆర్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర పోలీసులతోనూ విచారణ చేయించుకోవచ్చని కేసీఆర్ సర్కారుకు వివేక్ సవాల్ విసిరారు. ఫ్రస్టేషన్‌లో కేటీఆర్ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ ఓ ఫెయిల్యూర్ లీడర్ అని అన్నారు.

 మునుగోడులో వారి వల్లే టీఆర్ఎస్ గెలిచింద్న వివేక్

మునుగోడులో వారి వల్లే టీఆర్ఎస్ గెలిచింద్న వివేక్

ఇక మునుగోడు ఉపఎన్నికలో నైతిక విజయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే అని వివేక్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, పోలీసుల సహకారంతోనే టీఆర్ఎస్ గెలిచిందన్నారు. పోలింగ్ రోజు కూడా ఇతర నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మునుగోడులోనే తిష్టవేసి, విచ్చలవిడగా ఓటర్లకు డబ్బులు పంచిపెట్టారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపును టీఆర్ఎస్ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రలోభాలతోనే ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. కమ్యూనిస్టుల మద్దతు, పోలీసుల సహకారం లేకపోతే ఈ ఉపఎన్నికలు టీఆర్ఎస్ గెలిచేది కాదన్నారు వివేక్.

కేసీఆర్ అలా చేసుంటే మునుగోడులో ఓటమేనన్న వివేక్

కేసీఆర్ అలా చేసుంటే మునుగోడులో ఓటమేనన్న వివేక్

ప్రచారం చేసుకోనివ్వకుండా బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని వివేక్ మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ మునుగోడులోనే తిష్టవేసి ప్రచారం చేశారన్నారు. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేశారన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కేటీఆర్ ను సీఎం చేస్తే టీఆర్ఎస్ మనుగుడ లేకుండా పోతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ అలా చేయలేదని.. ఒకవేళ సీఎంగా కేటీఆర్ ను చేసివుంటే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయేదని వివేక్ అన్నారు.

తన ఫ్యాక్టరీని మూసివేయించారన్న వివేక్

తన ఫ్యాక్టరీని మూసివేయించారన్న వివేక్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పుంజుకుటోందని వివేక్ స్పస్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 65-70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ నాయకులు తమ సొంత ఆస్తులను మాత్రమే పెంచుకున్నారన్నారు. కేసీఆర్ పాలనలో సాగిన అవినీతి, అక్రమాలను త్వరలోనే తాము బయటపెడతామన్నారు. తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పటాన్‌చెరులో ఉన్న తమ ఫ్యాక్టరీని మూసివేయించారని వివేక్ తెలిపారు. బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్, కేటీఆర్ ఇష్టంవచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

English summary
BJP leader Vivek slams ktr and kcr for money transfer allegations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X