సీఎం రేసులో వీరే: అధికారం రాకముందే గాల్లో మేడలు కడుతున్న కమలనాధులు!!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. ఎన్ని సీట్లు వస్తాయో కూడా ఎవరికీ తెలీదు. ప్రజల్లో ఉన్న అభిమానం ఓటు బ్యాంకుగా మారుతుందా అంటే అది కూడా తెలీదు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మేమే అని చెబుతున్నా ప్రజలు బీజేపీని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా చూస్తారో లేదో కూడా తెలీదు. ఇన్ని ప్రశ్నలకు సమాధానం తెలియని, క్లారిటీ లేని బిజెపీలో నేతలు ఇప్పుడు గాల్లో మేడలు కట్టడం అటు రాజకీయ వర్గాలను, ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తెలంగాణా బీజేపీలో పెరుగుతున్న సీఎం ఆశావహులు

తెలంగాణా బీజేపీలో పెరుగుతున్న సీఎం ఆశావహులు


ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిందే లేదు కానీ, ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్న దానిపైన బీజేపీ లో ఇప్పటినుంచి చర్చ జరుగుతోంది. సీఎం అభ్యర్థిని నేనంటే నేనంటూ ఆశావహులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి తెలంగాణ బీజేపీ లో కనిపిస్తుంది. బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది తాను సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తనకు సీఎం అర్హతలు ఉన్నాయన్న డీకే అరుణ

తనకు సీఎం అర్హతలు ఉన్నాయన్న డీకే అరుణ

ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. నేను సీనియర్ ని అంటే నేను సీనియర్ ని అని చెబుతూ సీఎంగా తనకు అవకాశమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తదితరులు చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. డీకే అరుణ గతంలో పదేళ్లు మంత్రిగా తాను పని చేశానని, సీఎం కావడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి అని వ్యాఖ్యలు చేశారు.

సీఎం పీఠంపై ఈటల గురి

సీఎం పీఠంపై ఈటల గురి

మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం ప్రజలు కోరుకుంటే తాను తప్పకుండా సీఎం అవుతాను అంటూ ఆయన మనసులోని మాటను బయట పెట్టారు. అంతే కాదు దీనిపై తన సన్నిహితుల ద్వారా తెలంగాణ ప్రజలు ఈటల సీఎం కావాలని కోరుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయిస్తున్నట్టు బిజెపి వర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించి బీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలను బిజెపిలోకి తీసుకురావడానికి ఆపరేషన్ మొదలుపెట్టిన క్రమంలో ఈటల రాజేందర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. ఈటల రాజేందర్ తో అమిత్ షా భేటీ నేపథ్యంలోనే బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనే అంటూ చర్చ జరిగింది. ఇక మీడియా కూడా బీజేపీ సీఎం అభ్యర్థి ఈటల రాజేందర్ అంటూ ఊహాజనిత కథనాలను ప్రసారం చేసింది. ఇక ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ కూడా గట్టిగానే సీఎం స్థానంపై ఆశ పెట్టుకున్నారు.

బండి సంజయ్... కిషన్ రెడ్డి.. సీఎం రేసులో చాలా మందే

బండి సంజయ్... కిషన్ రెడ్డి.. సీఎం రేసులో చాలా మందే

ఇక తెలంగాణ రాష్ట్ర బిజెపి ఛీఫ్ బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటివారు కూడా సీఎం రేసులో ఉన్నట్టు గా బిజెపిలో చర్చ జరుగుతుంది. బండి సంజయ్ పాదయాత్రల ద్వారా బీజేపీలో తానే సుప్రీం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారని చేసిన ప్రకటన కూడా పార్టీలో ఆసక్తికర చర్చకు కారణమైంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టక ముందే బిజెపి నాయకులు సీఎం అభ్యర్థి నేనంటే నేనే అంటూ చేసుకుంటున్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

గాల్లో మేడలు కడుతున్న బీజేపీ నేతలు

గాల్లో మేడలు కడుతున్న బీజేపీ నేతలు

బిజెపిలో పార్టీ అధికారంలోకి రాకముందు సీఎం అభ్యర్థి ఎవరు అన్నది ప్రకటించే అవకాశం లేదు. అటువంటి చోట ఎవరికి వారు సీఎం అవుతానన్న ఆశతో గాల్లో మేడలు కట్టడం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశం అవుతుంది. ఇదెక్కడ గోల అన్నది చర్చనీయాంశం అవుతుంది. నేల విడిచి సాము చేయకుండా ముందు ఇవన్నీ పక్కనపెట్టి గెలిచే మార్గం చూడాలని భావిస్తున్నారు పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కాషాయ దండు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+