Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్కడ కరోనా కట్టడి కష్టం; నుమాయిష్ ఎగ్జిబిషన్ కు అనుమతి ఇవ్వొద్దు: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

నుమాయిష్ గా ప్రసిద్ది చెందిన ఆల్ ఇండియా పారిశ్రామిక వార్షిక ఎగ్జిబిషన్ (AIIE) ప్రతి ఏడాది జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమవుతుంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా నుమాయిష్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించాలా వద్దా అనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ క్రమంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించటానికి ఒక పక్క రంగం సిద్ధం చేస్తుంటే మరోపక్క అనుమతి ఇవ్వొద్దు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

కరోనా కేసులు పెరిగే ఛాన్స్ .. నుమాయిష్ వద్దు : ఎమ్మెల్యే రాజా సింగ్

కరోనా కేసులు పెరిగే ఛాన్స్ .. నుమాయిష్ వద్దు : ఎమ్మెల్యే రాజా సింగ్

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంతో పాటు, ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా ఎగ్జిబిషన్ కు అనుమతి ఇవ్వొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎగ్జిబిషన్ కు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని దీనివల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

వెంటనే ఎగ్జిబిషన్ ఏర్పాట్లను నిలిపివేయాలని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు దేశంలో చాలా రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు పెడుతున్నాయని ఆయన వెల్లడించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు రాజాసింగ్.

గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభానికి ప్రయత్నాలు చేస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ

గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభానికి ప్రయత్నాలు చేస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ

81 అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ ను జనవరి ఒకటవ తేదీన ప్రారంభించడానికి ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసి, ఫైర్ అనుమతులు తీసుకుని , కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో నుమాయిష్ ను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ను ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఎగ్జిబిషన్ లో కరోనా నిబంధనలు అమలయ్యేలా చూస్తామని, అలాగే తెలుగు ఎగ్జిబిషన్లో స్టాల్స్ నిర్వాహకులకు ,ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా కరోనా వ్యాక్సిన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

1500స్టాల్స్ తో ఎగ్జిబిషన్ .. కరోనా కట్టడి కష్టం అంటున్న ఎమ్మెల్యే

1500స్టాల్స్ తో ఎగ్జిబిషన్ .. కరోనా కట్టడి కష్టం అంటున్న ఎమ్మెల్యే

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఎగ్జిబిషన్ లో దుకాణాల సంఖ్య భారీగా తగ్గింది. ప్రతి ఏడు 2200 స్టాల్స్ ఏర్పాటు చేస్తుండగా ఈ ఏడు 1500 స్టాల్స్ మాత్రమే ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు శాఖలకు చెందిన వివిధ రకాల స్టాల్స్ ను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల స్టాళ్లు కూడా నుమాయిష్ లో ఏర్పాటు చేస్తారు. అయితే లక్షలాది మంది వచ్చే ఎగ్జిబిషన్ లో కరోనా కట్టడి సాధ్యపడదని, కేసులు పెరిగే అవకాశం ఉంటుందని, నుమాయిష్ నిర్వహించవద్దని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

దేశవ్యాప్తంగా 20 వేల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష జీవనోపాధి

దేశవ్యాప్తంగా 20 వేల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష జీవనోపాధి

అంతేకాకుండా, దాదాపు రెండు నెలల పాటు ఎగ్జిబిషన్ మీద ఆధారపడిన వడ్రంగి, చిత్రకారులు, ఎలక్ట్రీషియన్లు మరియు కార్మికులు వంటి వేలాది మంది తాత్కాలిక కార్మికులకు నుమాయిష్ ఉపాధి కల్పిస్తోంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం కూడా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరు. దాదాపు 20 లక్షల టికెట్లు, 15,00 స్టాల్స్ , స్టాల్ అద్దెలు , అందులో సాగే వ్యాపారం, దుకాణదారుల అమ్మకాల టర్నోవర్ ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+