బాంబులతో లేపేస్తామని బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు!

హైదరాబాద్: తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేసి హెచ్చరించారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గోరక్షా కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అన్నారు. గురువారం నాడు రాత్రి గోషామహల్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

7044 నంబరు నుంచి తనకు గత రాత్రి ఫోన్ చేశారన్నారు. గత అర్ధరాత్రి 11.30 గంటల నుండి తెల్లవారుజామున రెండు గంటల వరకు ఆరుసార్లు ఫోన్లు వచ్చాయని తెలిపారు. తనను తీవ్రంగా హెచ్చరించారన్నారు. ఓసారి పాకిస్తాన్ అని, మరోసారి ఆప్ఘనిస్తాన్ అని చెప్పారని తెలిపారు. ఆరుసార్లు ఫోన్లు వచ్చాయన్నారు.

BJP MLA Raja Singh receives threat calls

ఛత్రపతి శివాజీ ర్యాలీలో తనను బాంబులతో పేల్చివేస్తామని బెదిరించారన్నారు. మంగళ్ హాట్ పోలీసులకు ఫోన్ రికార్డింగులు సహా ఫిర్యాదు చేశానని, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డిని పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించానని, స్పందన రాలేదన్నారు.

తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ పైన ఎప్పుడు భయపడలేదని చెప్పారు. తాను ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు జోక్యం చేసుకోకపోవడం పైన అనుమానాలు వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీతో పోలీసులు మిలాఖత్ అయ్యారా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై పోలీసు కమిషనర్ వివరణ ఇవ్వాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+