బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లాయర్‌కు ప్రాణహాని - భద్రత
హైదరాబాద్: సస్పెన్షన్‌కు గురైన భారతీయ జనతా పార్టీ గోషామహల్ శాసన సభ్యడు టీ రాజా సింగ్.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకంపన తీవ్రత తగ్గట్లేదు. పాతబస్తీలో ఈ ఉదయం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఏఐఎంఐఎం నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పలుచోట్ల రాజా సింగ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన టీ రాజా సింగ్ అరెస్ట్ అయ్యారు. ఆయనను నాంపల్లి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఆయనకు బెయిల్ లభించింది. అరెస్టయిన కొన్ని గంటలకే ఆయనను బీజేపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సభాపక్ష నేత హోదా నుంచీ తొలగించింది. 10 రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఆయన అరెస్టును నిరసిస్తూ ఇవ్వాళ బీజేపీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. నిరసన దీక్షలను చేపట్టనుంది.

మరోవంక- రాజా సింగ్ తరఫున నాంపల్లి న్యాయస్థానంలో కేసును వాదించిన సీనియర్ అడ్వొకేట్ కరుణ సాగర్‌కు బెదిరింపు ఫోన్లు అందాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రెండు ఫోన్ కాల్స్ అందినట్లు ఆయన వెల్లడించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి తనకు ఫోన్ చేశారని వివరించారు. ప్రాణహాని తలపెడతామని వారు బెదిరించినట్లు చెప్పారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, రక్షణ కల్పించాలని కోరుతానని అన్నారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యే రాజా సింగ్‌కు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన తరువాత ఆయనను నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచారు పోలీసులు. రిమాండ్‌కు తరలించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.

రాజా సింగ్ అరెస్ట్ విషయంలో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 41 నిబంధనలను పాటించలేదని స్పష్టం చేసింది. రిమాండ్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయ పడింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. రాజా సింగ్‌కు బెయిల్ లభించేలా చేయడంలో అడ్వొకేట్ కరుణ సాగర్ కీలక పాత్ర వహించారు. తక్షణమే బెయిల్ లభించేలా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications