రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ ఇవ్వండి, కేసీఆర్‌కు రాజాసింగ్ లేఖ

వలసకూలీల వెతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వలస కూలీలను ఆదుకోవాలని శుక్రవారం లేఖ రాశారు. ఉపాధి లేక కూలీల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. ప్రభుత్వం అందజేసే రేషన్‌పై వారి జీవితం ఆధారపడి ఉందని గుర్తుచేశారు.

bjp mla raja singh writes letter to cm kcr..

రాష్ట్రంలో కొందరి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించారని రాజాసింగ్ గుర్తుచేశారు. వారు కొత్త రేషన్ కార్డు కోసం ఆప్లై చేసుకున్నారని.. వారికి కార్డు రాలేదని చెప్పారు. ప్రస్తుతం వారు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నవారికి కూడా రేషన్ కార్డు హోల్డర్ మాదిరిగా 12 కిలోల బియ్యం, రూ.1500 ఇవ్వాలని కోరారు.

Recommended Video

    Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied

    దీంతో వలసకూలీల ఆకలి కేకలను కొంచెమైనా తీర్చొచ్చని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి అందరికీ ఒకేలా సరుకులు అందజేయాలని కోరారు. దీంతోపాటు కొత్తగా జారీచేసే రేషన్ కార్డులను వీలైనంత త్వరగా అందజేయాలని సీఎం కేసీఆర్‌ను రాజాసింగ్ కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+