తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు నామినేషన్లు వేశారు. ప్రత్యేక పూజల అనంతరం, భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయల్దేరారు.
మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మెదక్ కలెక్టరేట్ వద్దకు ఆయన భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు, మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. శామీర్‌పేట నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు ఈటల కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు.

కలెక్టరేట్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈటల రాజేందర్, ఆయన సతీమణి 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు హరదీప్‌సింగ్ పురీ, కిషన్‌రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ వేసిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ప్రత్యేక వాతావరణంలో జరుగుతున్నాయన్నారు.
ఎన్నికల ప్రచారంలో 50 రోజులుగా ప్రజల అభిప్రాయాలు వింటున్నామని, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ప్రజలు అంటున్నారని చెప్పారు. ఎక్కడ చూసినా అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదాలే వినిపిస్తున్నాయన్నారు. మోడీ ఉంటేనే దేశం అభివృద్ధివైపు మరింతగా దూసుకెళ్తుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మోడీ పాలనలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని ఈటల రాజేందర్ వివరించారు.
మోడీ పాలన వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం పెరిగిందని చెబుతున్నారని, కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను ప్రధాని కాపాడారని ఈటల రాజేందర్ తెలిపారు. తమ జీవితాల్లో మోడీ వెలుగులు నింపారని బడుగు వర్గాలు అంటున్నారని, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని ఈటల చెప్పారు. కేసీఆర్,రేవంత్ డబ్బు సంచులతో నాయకుల తలలకు వెల కట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. మినీ ఇండియాగా మల్కాజిగిరికి మారుపేరు ఉందని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.
దొంగ సర్వేలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఈటల మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తోంది. ఓట్లు, సీట్లు కాదు మల్కాజిగిరిని ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తా. మోడీ అండతో మల్కాజిగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేస్తామన్నారు. సర్వేల అంచనాలు తలకిందులు చేస్తూ భారీ మెజార్టీతో గెలుస్తామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక, మహబూబ్‌నగర్ ఎంపీ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కూడా గురువారం నామినేషన్ వేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో కలిసి మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌కు వెళ్లిన ఆమె రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకు ముందు పట్టణంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నామినేషన్ పత్రాలకు డీకే అరుణ పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి అనేక సేవలు చేశానని చెప్పారు. జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులు వచ్చేందుకు కృషి చేశానని తెలిరపారు. ప్రజల కోసం పనిచేసే తతనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారనిర మండిపడ్డారు. మహిళ అనే మర్యాద కూడా లేకుండా తనను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకునే తనను ప్రజలంతా ఆశీర్వదించి గెలిపిస్తే మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని డీకే అరుణ స్పష్టం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications