కేసీఆర్‌కు మతిమరుపు ఎక్కువైంది, జైలు తప్పదు: ధర్మపురి అరవింద్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం కేసీఆర్ ఏదో ఒక రోజు కచ్చితంగా జైలుకు పోకతప్పదన్నారు. కేసీఆర్ చేసిన అవినీతే ఆయనను జైలుకు పంపిస్తుందన్నారు.కేసీఆర్ చేసిన అవినీతిపై ఆధారాలు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామని చెప్పారు.
కేసీఆర్‌కు మతిమరుపు ఎక్కువైందని అరవింద్ అన్నారు. ఆయనిక సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకోవడం బెటర్ అని బీజేపీ ఎంపీ చెప్పారు. వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. రైస్ మిల్లులను ఆధునికీకరించుకోవాలని మాత్రమే రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్రం తెలిపిందన్నారు.
హుజురాబాద్ లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓటమిపాలు కావడాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని అరవింద్ వ్యాఖ్యానించారు. బీజేపీ సాధించిన ఘన విజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు.

దేశరక్షణపై సీఎం కేసీఆర్ అహంకారంతో మాట్లాడారు
బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశ రక్షణపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు . సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దేశరక్షణపై అహంకారంతో మట్లాడటం బాధాకరమన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక్క ఇంచ్ భూమిని కూడా చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. అధికారం మత్తులో కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. అంతేకాదు..పెట్రోల్, డీజీల్ పై 2015 ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచిందని తెలిపారు. తెలంగాణలో సాయంత్రం ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గింట్లేడదని ప్రశ్నించారు.
అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ. సోమవారం కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్‌కు కళ్లు తెరిపించాయన్నారు.
హుజురాబాద్ బీజేపీ గెలుపు దుబాయ్ శేఖర్‌కు సెగ తగిలించిందంటూ ఎద్దేవా చేశారు డీకే అరుణ. ఆ రిజల్ట్ చూసి ఆయన దిమ్మ తిరిగిందన్నారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్నారు. 1200 మందిని చంపి... ఈ రోజు సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటమి గెలుపులు సహజం అని ఇప్పుడు అంటున్నారు.. ఆయనకు ఇప్పుడు జ్ఞానోదయమైనట్టుందన్నారు అరుణ. హుజూరాబాద్‌లో అన్ని డబ్బు లు ఎందుకు ఖర్చు పెట్టావు కేసీఆర్ అని ప్రశ్నించారు.
దళిత బంధును ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని లేదంటే విడిచి పెట్టమని డీకె అరుణ స్పస్టం చేశారు. నువ్వు(కేసీఆర్) బయటకి రావాల్సిందే.. తెలంగాణకు ఏమి చేశావో చెప్పా ల్సిందేనన్నారు. కేసీఆర్ నువ్వు తెలంగాణ ద్రోహివే కాదు.. దేశద్రోహి వి కూడా .. భారతీయుడిగా మాట్లాడినవా సోయిలేదా? అంటూ ఆమె కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతోష్ బాబు మరణాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నావ్.. ప్రజలు అన్ని గమినిస్తున్నారు.. అహంకారాన్ని ఇకనైనా దించుకో అంటూ డీకే అరుణ విమర్శలు గుప్పించారు.
Recommended Video
భారత సైనికుల గురించి మాట్లాడినవ్ అంటే ఎంతకన్నా దిగజా రుతావు... పెట్రోల్, డీజిల్ పై కేసీఆర్ ధరలు తగ్గించడు కానీ కేంద్రం మాత్రం తగ్గించాలా ? అని మండిపడ్డారు. వ్యాట్ పెంచలేదని సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు. మద్యాన్ని వ్యాపారంలా చేశారని, మద్యం ఆదాయం రూ.6 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు పెరిగిందన్నారు. సీఎంగా రోల్ మోడల్‌గా ఉండాలి... నువ్వు తాగితే తాగు, కానీ తాగిపించి కుటుం బాలను నాశనం చేస్తున్నావని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు. బూతులు మాట్లాడుతున్నారు.. కేటీఆర్ నీ తండ్రి పై పెట్టు కేసు.. తెలంగాణ రాకముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడెంతా చెప్పు తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసనని ప్రజలు క్షమించరని దుయ్యబట్టారు డీకే అరుణ.












Click it and Unblock the Notifications