సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి: డీకే అరుణ డిమాండ్, ఎందుకంటే?

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీగా గెలిచిన డీకే అరుణ. బుధవారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో డీకే అరుణ మాట్లాడారు.
లోక్‌​సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరండం అని 14 సీట్లు సాధిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని.. అది ఏమైందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఓడిపోవడంతో బీఆర్ఎస్​ ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోడీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని.. మహబూబ్​నగర్‌​లో ఓడిపోయినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మహబూబ్​‌నగర్‌​లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అభ్యర్థిలా వ్యవహరించారని ఎద్దేవా చేశారు.

BJP MP DK Aruna demands CM Revanth reddy resignation

మోడీ మూడోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారని డీకే అరుణ తెలిపారు. కర్ణాటక నుంచి వచ్చి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో స్నేహాపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. 10 సీట్లు వస్తాయని అంచనా వేశాం.. కానీ, 8 సీట్లకు పరిమితమయ్యామని డీకే అరుణ తెలిపారు. అయోధ్య ఉండే ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమికి స్థానిక కారణాలు కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు

కేంద్రమంత్రి పదవిపై డీకే అరుణ ఏమన్నారంటే?

లోక్‌​సభ ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి మోడీ అభివృద్ధి నినాదం వెళ్లిందన్నారు డీకే అరుణ. బీజేపీని అడ్డుకోవడం కోసం రిజర్వేషన్లు తీసివేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇక, తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కష్టపడి పని చేస్తానన్నారు. కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదని డీకే అరుణ స్పష్టం చేశారు. జూన్ 7వ తేదీన ఎంపీలమంతా ఢిల్లీకి వెళుతున్నామని, 8న ప్రధాని ప్రమాణ స్వీకారం ఉంటుందని డీకే అరుణ తెలిపారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినట్లు ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+