మోడీ తెలంగాణా వస్తే అడ్డుకోవటం దేనికి? కేసీఆర్ కడుపుమంట ఎందుకు?: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం లోని ఎరువుల ఫ్యాక్టరీ ని ప్రారంభించి జాతికి అంకితం చేయడానికి నవంబర్ 12వ తేదీన తెలంగాణా కు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకోవడం కోసం టిఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటినుండో ఉత్పత్తి మొదలు పెట్టిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడం దేనికి అంటూ ప్రశ్నిస్తున్న టిఆర్ఎస్ నేతలు, తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం చేస్తున్న ప్రధాని మోడీ ని అడ్డుకుని తీరుతామని చెబుతున్నారు.

మోడీ పర్యటన అడ్డుకుంటామన్న టీఆర్ఎస్ ప్రకటనలపై మండిపడిన ఎంపీ లక్ష్మణ్
ఇక తాజా పరిణామాలతో బి జె పి ఎంపీ లక్ష్మణ్ కెసిఆర్ తీరుపై, టిఆర్ఎస్ పార్టీ నాయకుల విమర్శలపై మండిపడ్డారు. బిజెపిని, ప్రధాని మోడీ ని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని, హామీలు నెరవేర్చని కెసిఆర్ కు కేంద్రాన్ని విమర్శించే స్థాయి లేదని బిజెపి ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక, రామగుండం పర్యటనను ఫెయిల్ చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మోడీ తెలంగాణా వస్తే కేసీఆర్ కు కడుపు మంట దేనికో
తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్లుగా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ఇవ్వలేదని బిజెపి ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ప్రధాని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ని ప్రారంభిస్తే కెసిఆర్ కు కడుపు మంట దేనికో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణా రైతుల కోసం కేంద్రం చేస్తున్న పనులను ఒర్చుకోలేకపోతున్నారా అంటూ మండిపడ్డారు. కమ్యూనిస్టుల సహకారంతోనే మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ గెలిచిందని బిజెపి ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టుల పరిస్థితి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు గా ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ అవినీతి పాలనను, కుటుంబ పాలనను వ్యతిరేకించి సత్తా, ఎదుర్కొనే దమ్ము బిజెపికే ఉందని ఎంపీ లక్ష్మణ్ తేల్చిచెప్పారు.

మోడీ పర్యటన నేపధ్యంలో తెలంగాణాలో రాజకీయ రగడ
ఇదిలా ఉంటే ఈనెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకారని తెలుస్తుంది. ఇప్పటికే దేశంలో అధికారంలో ఉన్న బిజెపిని నిరంతరం వ్యతిరేకిస్తున్న టిఆర్ఎస్, తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మోడీ పర్యటన అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్న వేళ, మోడీ పర్యటన అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ లక్ష్మణ్ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ టిఆర్ఎస్ శ్రేణులపై నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications