రాజాసింగ్ రాజీనామా ఆమోదం- ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటుకు సిద్దం..!!
బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామను పార్టీ ఆమోదించింది. కొంత కాలంగా పార్టీలో రాజా సింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పార్టీ నేతల పైన రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల పైన హై కమాండ్ ఆగ్రహంగా ఉంది. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక సమయంలో రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసారు. ఈ అంశాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ అధ్యక్షుడికి నివేదించింది.
దీని పైన ఆరా తీసిన నడ్డా రాజీనామా ఆమోదించారు. అదే విధంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే పదవి రావటంతో.. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు లేఖ రాయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, రాజాసింగ్ తాను చేరే కొత్త పార్టీకి రంగం సిద్దం చేసుకున్నారు.

రాజీనామా ఆమోదంతో
రాజాసింగ్ వ్యవహారంలో ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వచ్చిన రాజాసింగ్.. కొంత కాలంగా తెలంగాణ పార్టీ నేతల పైన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామ చంద్రరావు ఎన్నిక సమయంలో రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేసేందుకు రాగా.. తనకు నామినే షన్ వేసేందుకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. ఆ సమయంలోనే పార్టీ కార్యాలయం వేదిక గా బీజేపీకి రాజీనామా చేసారు. తాను బీజేపీ సింబల్ పైన ఎమ్మెల్యేగా గెలవటంతో తన రాజీనామా పైన స్పీకర్ కు నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలే లేఖ రాయాలని వ్యాఖ్యానించారు.
Union Minister and BJP national president JP Nadda accepts the resignation of Telangana MLA T Raja Singh from the party with immediate effect. pic.twitter.com/CJIAKvhQrk
— ANI (@ANI) July 11, 2025
ఎమ్మెల్యే పదవిపై
కాగా, రాజాసింగ్ రాజీనామా అంశాన్ని ఢిల్లీలోని పార్టీ అధినాయకత్వానికి రాష్ట్ర నేతలు నివేదిం చారు. దీని పైన పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా పూర్తి సమాచారం సేకరించారు. రాజాసింగ్ చేసిన రాజీనామా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీకి రాజీనామా చేయటం తో రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేత లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నేత.. పార్టీకి రాజీనామా చేయటంతో పదవిలో కొనసాగే అర్హత లేదని .. రాజాసింగ్ పైన అనర్హత వేటు వేయాలని కోరనున్నారు. అయితే, బీజేపీ నేతల లేఖ పైన స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
శివసేనలోకి ఎంట్రీ
ఇక.. అటు రాజాసింగ్ బీజేపీకి రాజీనామా కు ముందే తన రాజకీయ భవిష్యత్ పైన నిర్ణయం తీసు కున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాను హిందుత్వం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు. ఇక.. ఇప్పుడు బీజేపీ తన రాజీనామా ఆమోదించటంతో శివసేనలో చేరేందుకు రాజా సింగ్ సిద్దమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగం పూర్తయినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతల లేఖ ఆధారంగా స్పీకర్ తన పైన అనర్హత వేటు వేస్తే శివసేన నుంచే గోషామహల్ అభ్యర్దిగా పోటీ చేయాలని రాజాసింగ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు పార్టీకి రాజా సింగ్ చేసిన రాజీనామా ఆమోదించటంతో.. ఇక, ఎమ్మెల్యే పదవి పైన బీజేపీ నెక్స్ట్ ఏం చేయబో తోంది..స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications