కోదండరాం ఏదుటే కేసీఆర్‌ను ఏకేసిన కిషన్(పిక్చర్స్)

మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా గ్రామంలో బీజేపీ పోరుయాత్ర విజయోత్సవ సభను సోమవారం నిర్వహించింది. అంతకుముందు రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్‌లో కృష్ణా గ్రామానికి పోరుయాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సభలో మూడేళ్ల క్రితం పోరుయాత్ర చేసిన కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, నాగం తదితరులు మండిపడ్డారు.

 బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

నిజాం పరిపాలనలో జరిగిన దౌర్జన్యాలపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేసీఆర్‌ సిద్ధమా? అని కిషన్ రెడ్డి సవాల్‌ విసిరారు.

 బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

మజ్లిస్ పార్టీతో స్నేహం, గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా కేసీఆర్ నిజాం నవాబును పొగుడుతున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

హైదరాబాద్‌లో మజ్లిస్‌ గుండాయిజం అందరికీ తెలిసిందేనని, గత ప్రభుత్వ హయాంలో ఒక డీజీపీని సైతం బెదించిన ఆ పార్టీని వెనకేసుకురావడం కేసీఆర్‌కు ఎంతవరకు సమంజసమన్నారు.

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

తెలంగాణ ప్రజలను అవస్థలు పెట్టిన నిజాం రాజులను పొగుడుతున్న కేసీఆర్‌ వైఖరిని గ్రామగ్రామాన ఎండగట్టాలని ఆయన బీజేపీ కార్యకర్తలకు సూచించారు.

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

ఫీజురీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం గండికొట్టిందని విమర్శించారు. జిల్లాల పర్యటనకు వస్తున్న కేసీఆర్‌కు అక్కడి దుర్భర పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

కేంద్రానికి అన్నీ రాష్ర్టాలూ సమానమని, ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపించడం లేదని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

విద్యుత్‌ సంక్షోభం నుంచి రాష్ర్టాన్ని గట్టెక్కించేందుకు పాలమూరు జిల్లా గట్టులో వెయ్యిమెగావాట్ల సోలార్‌ప్లాంట్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. తెలంగాణకు అనేక ప్రాజెక్టులు, వర్సిటీలను కూడా కేంద్రం ఇచ్చిందన్నారు.

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

తెలంగాణ సంపూర్ణ విభజన ఇంకా పూర్తికాలేదని, ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు ఫ్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేయాలని కోదండరాం కోరారు.

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

తెలంగాణ సాధన ఉధ్యమంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన పోరుయాత్ర కీలకమైందని ఆచార్య కోదండరామ్ ఈ సందర్భంగా అన్నారు.

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్‌ వాటర్‌గ్రిడ్‌ పేరుతో పైపుల కుంభకోణానికి పాల్పడే అవకాశముందని, కోట్లాదిరూపాయలు దోచుకునేందుకు ఈ పథకాన్ని రూపొందించారని ఆరోపించారు.

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

ప్రభుత్వంచేసే అవినీతిని ఎండగట్టేందుకు కాపలా కుక్కలా కాకుండా వాచ్‌డాగ్‌లా పని చేస్తానని చెప్పారు. పోరుయాత్ర సందర్భంగా కృష్ణ గ్రామంలో రక్తదాన శిభిరం నిర్వహించారు.

 బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

బీజేపీ పోరు యాత్ర విజయోత్సవ సభ

తెలంగాణవీరుల ఆత్మశాంతికి యజ్ఞం, ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+