వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్.. వడ్లుకొను లేదా గద్దెదిగు; రైతుల్ని దగాచేసి ఇప్పుడు దొంగనాటకాలా? భగ్గుమన్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సాగుచేసిన యాసంగి ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వేదికగా మహా ధర్నా నిర్వహించింది. ఇక టిఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు పోటీగా తెలంగాణ బిజెపి నేతలు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రైతు దీక్ష నిర్వహించారు. రైతు దీక్ష వేదికగా తెలంగాణ బీజేపీ నేతలు టిఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

బీజేపీ రైతు దీక్ష ...కెసిఆర్ వడ్లు కొను లేదా గద్దె దిగు

బీజేపీ రైతు దీక్ష ...కెసిఆర్ వడ్లు కొను లేదా గద్దె దిగు

కెసిఆర్ వడ్లు కొను లేదా గద్దె దిగు అంటూ బిజెపి శ్రేణులు రైతుదీక్ష నిర్వహిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మురళీధర్ రావు తదితరులు బీజేపీ నిర్వహిస్తున్న రైతు దీక్షలో పాల్గొని కెసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. కెసిఆర్ చేసేది యుద్ధం కాదు రాద్ధాంతం అని మండిపడుతున్న బీజేపీ నేతలు మీది వ్యూహం కాదు కుతంత్రం అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణా రైతాంగాన్ని కెసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు.

రైతులని దగా చేసి ఇప్పుడు ధర్నాలు చేస్తారా? బీజేపీ ఫైర్

రైతులని దగా చేసి ఇప్పుడు ధర్నాలు చేస్తారా? బీజేపీ ఫైర్

కెసిఆర్ చేసేది పోరాటం కాదు ఆర్భాటం అని , రైతుల్ని దగా చేసి ఇప్పుడు ధర్నాలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. జాతీయ నాయకుడిగా చెప్పుకోవటం కోసమే కేసీఆర్ ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అన్నదాతలను మోసం చేసి ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారా అంటూ కెసిఆర్ పై విరుచుకుపడుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ధాన్యం కొనుగోలు చేయకుండా వంచిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి వైఖరిపై రైతులు తిరగబడుతున్నారు అని బిజెపి నేతలు పేర్కొన్నారు.

కెసీఆర్ మహాధర్నాను టార్గెట్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద దీక్షలో పాల్గొన్న బీజేపీ నేతలు

కెసీఆర్ మహాధర్నాను టార్గెట్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద దీక్షలో పాల్గొన్న బీజేపీ నేతలు


బీజేపీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షాస్థలికి భారీగా రైతులు తరలి వచ్చారని వెల్లడించారు. ధాన్యం కొనకుండా తెలంగాణ రైతులను దగా చేస్తున్న సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన బిజెపి రైతు దీక్షకు పెద్దఎత్తున రైతుల నుండి మద్దతు వచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా కేసీఆర్ సర్కారు చేస్తున్నది మహాధర్నా కాదని విమర్శిస్తున్నారు. రైతు సంక్షేమం పట్టని కేసీఆర్, రాష్ట్ర రైతాంగాన్ని గాలికి వదిలేసి, ఢిల్లీలో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని బిజెపి నేతలు మండిపడుతున్నారు. కావాలని బీజేపీ పై దుష్ప్రచారం చేయడం కోసమే కెసిఆర్ శతవిధాల తాపత్రయపడుతున్నాడు అని ఆరోపిస్తున్నారు.

కెసీఆర్ పెద్ద అబద్దాల కోరు: వివేక వెంకటస్వామి ధ్వజం

కెసీఆర్ పెద్ద అబద్దాల కోరు: వివేక వెంకటస్వామి ధ్వజం


బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కెసిఆర్ పెద్ద అబద్దాల కోరు అని మండిపడ్డారు. బిజెపి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న ఆయన కెసిఆర్ కు కమీషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదని ఈశ్వరం ప్రాజెక్టు పేరుతో కెసిఆర్ వేల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కెసిఆర్ తన తుగ్లక్ పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని విమర్శించారు. పీకే సర్వే ఫలితాల నేపథ్యంలో కెసిఆర్ వరి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణలో బిజెపి ఎదుగుదలను ఆపలేరని తేల్చి చెప్పారు.

English summary
BJP leaders have expressed outrage in farmer's protest in Indira Park, slams the KCR .. cheating farmers, and now doing protests. BJP demanded KCR to buy paddy or resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X