బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల: కీలక స్థానాల్లో అభ్యర్థులు వీరే

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP) గురువారం విడుదల చేసింది. ఇప్టపికే మూడు విడతల్లో అభ్యర్థులను బీజేపీ.. నేటి సాయంత్రం నాలుగో జాబితాను విడుదల చేసింది. టికెట్ ఖరారైన అభ్యర్థులకు బీజేపీ కీలక నేతలు ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం అందించారు.

కంటోన్మెంట్ స్థానం నుంచి కృష్ణప్రసాద్, నాంపల్లి నుంచి రాహుల్ చంద్ర, శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్, మేడ్చల్ నుంచి రామచంద్రరావు, పెద్దపల్లి స్థానం నుంచి ప్రదీప్ కుమార్, సంగారెడ్డి స్థానం నుంచి పులిమామిడి రాజుకు టికెట్ కేటాయించినట్లు బీజేపీ ఓ ప్రకటనలతో తెలిపింది. మొత్తం నాలుగు విడతల్లో వంద స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 8 స్థానాలకు జనసేనకు కేటాయించింది. మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

BJP releases fourth list of mla candidates for telangana assembly elections

ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు. జాతీయ నాయకులతోపాటు రాష్ట్ర నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రెండు పార్టీలకు ఇప్పటికే అవకాశం ఇచ్చారని.. బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

మరోవైపు, నామినేషన్ దాఖలు చేసేందుకు మరొక్కరోజే గడువు ఉండటంతో గురువారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గజ్వేల్ తోపాటు కామారెడ్డిలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా నేడు నామినేషన్లు దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+