సంక్రాంతి ముగ్గులతోనూ కేసీఆర్ కు బీజేపీ షాక్!!

తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బిజెపి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్రను కొనసాగించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ప్రజల మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రజా గోస బిజెపి భరోసా పేరుతో బైక్ ర్యాలీలు చేస్తూ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు.

తెలంగాణాపై నజర్ పెట్టిన బీఎల్ సంతోష్

తెలంగాణాపై నజర్ పెట్టిన బీఎల్ సంతోష్

ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు, ధర్నాలు చేస్తూ, క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలను రూపొందించుకొని, వచ్చే ఎన్నికల నాటి కి ప్రజల్లోకి బలంగా వెళ్లాలని, క్రింది స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని కాషాయ దండు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కెసిఆర్ ను వచ్చే ఎన్నికలలో గద్దె దించటం కోసం బిజెపి అధినాయకత్వం కూడా రోజుకో కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపిలో కీలక నాయకుడుగా చెప్పుకునే బి ఎల్ సంతోష్ ప్రధానంగా ఫోకస్ చేసి కొత్త ఎత్తుగడలతో ప్రజల్లోకి వెళ్లడానికి దిశానిర్దేశం చేస్తున్నారు.

సంక్రాంతి పండుగకు బీజేపీ సరికొత్త స్ట్రాటజీ

సంక్రాంతి పండుగకు బీజేపీ సరికొత్త స్ట్రాటజీ

ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇక తాజాగా వచ్చే సంక్రాంతి పండుగను కూడా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి వాడుకోవాలని, తమ బలాన్ని ప్రత్యర్థి పార్టీలకు తెలిసేలాగా కార్యక్రమాలు రూపొందించాలని బి ఎల్ సంతోష్ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా మహిళలకు చేరువ కావడానికి, బిజెపి బలం తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు ప్రతి చోట పెద్ద ఎత్తున కమలం పువ్వుతో సంక్రాంతి ముగ్గులు వేయించాలని బిజెపి అధినాయకత్వం సూచించింది.

సంక్రాంతికి బీజేపీ కమలం పువ్వు గుర్తుతో ముగ్గులు

సంక్రాంతికి బీజేపీ కమలం పువ్వు గుర్తుతో ముగ్గులు

సంక్రాంతి పండుగ అంటేనే మహిళలు ఎక్కువగా ఇష్టపడే పండుగ. ముఖ్యంగా ఇంటి ముందు ముగ్గులు వేయడాన్ని మహిళలు ఇష్టపడతారు. రకరకాల డిజైన్లతో ముగ్గులు వేసి, వాటిలో రంగులు నింపి ప్రతి ఇంటి ముందు కలర్ ఫుల్ గా ముగ్గులు దర్శనమిస్తాయి. ఇక ఈ క్రమంలోనే బిజెపి గుర్తు అయిన కమలం పువ్వు ను ఇళ్ళ ముందు వేసి ముగ్గులు తీర్చిదిద్ది బిజెపి బలాన్ని ప్రత్యర్థులకు చూపించాలని అధిష్టానం సూచించింది. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ ఇళ్ల తోపాటు, గ్రామాలు, పట్టణాలు, సిటీలలో బిజెపి అభిమానులతో ఇంటి ముందు కమలం పువ్వు గుర్తు తో ముగ్గులు వేయించాలని నిర్ణయించారు.

సంక్రాంతి ముగ్గుల స్ట్రాటజీ వెనుక కారణాలు ఇవే

సంక్రాంతి ముగ్గుల స్ట్రాటజీ వెనుక కారణాలు ఇవే

దీనివల్ల ప్రత్యర్థులకు బిజెపి బలం తెలియడంతో పాటు, కమలం పువ్వు గుర్తు కూడా బలంగా ప్రజల్లోకి వెళుతుందని, బీజేపీకి పెద్ద ఎత్తున ప్రచారం దొరుకుతుందని భావిస్తున్నారు. బీజేపీ గతంలో ఈ వ్యూహాన్ని గుజరాత్లో అమలు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ బిజెపి ఈ ప్లాన్ ను అమలు చేయబడుతుంది. మొత్తానికి మహిళలతో బీజేపీ గుర్తు ముగ్గు వేయించి మహిళల మనసులో బీజేపీకి స్థానం సంపాదించే ప్రయత్నం చేయడంతో పాటు, పార్టీ శ్రేణులలోనూ నూతన ఉత్సాహం నింపడానికి, ప్రత్యర్థులను టెన్షన్ పెట్టడానికి బిజెపి రకరకాల ప్రణాళికలతో ముందుకు వెళుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+