ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పని చేయాలి: బండి సంజయ్
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి సందర్బంగా జిల్లా కేంద్రంలోని మహా శక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికి విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.
విజయానికి గుర్తుగా
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. పేద ప్రజల కష్టాలు తొలగిపోవాలని, సమాజమంతా ఐక్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు. దసరా సందర్భంగా నేతలంతా స్వార్థం వీడాలన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నారు.

భక్తి శ్రద్ధలతో
ధర్మ రక్షణ కోసం శక్తివంతమైన భారతదేశ నిర్మాణం, శక్తవంతమైన ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అందరూ కంకణ బద్దులై ఉండాలని పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను జరుపుకున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications