కేసీఆర్ టార్గెట్ గా.. విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నాల హోరు; పలుచోట్ల ఉద్రిక్తత

కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బిజెపి మెడకు ఉచ్చు బిగించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తుంటే రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ చార్జీలపై, ఆర్టీసీ బస్సు ఛార్జీలపై, అలాగే ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని, టిఆర్ఎస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నేతలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి కెసిఆర్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు.

నల్గొండ లో బీజేపీ నిరసన ర్యాలీ.. ఉద్రిక్తత

నల్గొండ లో బీజేపీ నిరసన ర్యాలీ.. ఉద్రిక్తత


విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన బీజేపీ అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నల్గొండ జిల్లాలోని బీజేపీ విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టింది. బిజెపి జిల్లా కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన బీజేపీ శ్రేణులు విద్యుత్ చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసలే ప్రజలు కష్టాల్లో ఉంటే, విద్యుత్ ఛార్జీల పెంపు తో మరింత భారాన్ని వేస్తున్నారు అంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 పోలీసుల లాఠీ చార్జ్ లో మహిళా నేతకు గాయాలు

పోలీసుల లాఠీ చార్జ్ లో మహిళా నేతకు గాయాలు

బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూధన రెడ్డి, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, పాలకూరి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జి నిర్వహించారు. ర్యాలీ చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నల్గొండలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిత గాయపడ్డారు.

 హన్మకొండలో బీజేపీ నిరసన ర్యాలీ

హన్మకొండలో బీజేపీ నిరసన ర్యాలీ


టిఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని అమరవీరుల స్థూపం నుండి టీఎస్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం నక్కలగుట్ట వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు. బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలోనూ బీజేపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

 ఖైరతాబాద్ చౌరస్తాలో బీజేపీ ధర్నా.. అడ్డుకున్న పోలీసులు

ఖైరతాబాద్ చౌరస్తాలో బీజేపీ ధర్నా.. అడ్డుకున్న పోలీసులు


విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఖైరతాబాద్ చౌరస్తాలో బీజేపీ ధర్నా నిర్వహించింది. టిఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు. బిజెపి నేతల ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

కరెంట్ చార్జీల పెంపుపై మండిపడిన బండి సంజయ్

కరెంట్ చార్జీల పెంపుపై మండిపడిన బండి సంజయ్


ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని, అందుకే ప్రజలపై కరెంట్ చార్జీల పెంపుతో మోయలేని భారాన్ని వేస్తోందని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ లకు కట్టాల్సిన 48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని బండి సంజయ్ మండిపడ్డారు. డిస్కమ్లకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంటు బకాయిలు 17 వేల కోట్లు అయితే అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిల 12598 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రజలపై వేస్తున్న కరెంట్ చార్జీల భారంపై బండి సంజయ్ ఫైర్

టీఆర్ఎస్ ప్రజలపై వేస్తున్న కరెంట్ చార్జీల భారంపై బండి సంజయ్ ఫైర్


కేవలం వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు 4603కోట్లు కాగా వాటిలో అత్యధికంగా పాతబస్తీకి చెందిన బకాయిలు ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు. కరెంటు చార్జీలు తగ్గించే వరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని వెల్లడించిన బండి సంజయ్ రాష్ట్ర ప్రజలపై పన్ను భారం మోపుతున్న టిఆర్ఎస్ సర్కార్ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను తెలియజేయడం కోసం ప్రజలంతా బీజేపీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు బీజేపీ నాయకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+