కేసీఆర్ ఆశలు గాల్లో మేడలే.. 100 సీట్లలో ఓడిపోతారు: తరుణ్ చుగ్ సంచలనం
తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని పెద్ద ఎత్తున ప్రచారమైన సమయంలో అసలు ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు అసెంబ్లీ నియోజకవర్గాలలో సర్వేలు జరుగుతున్నాయని, ఆరునూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని కేసీఆర్ వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 95 నుండి 105 సీట్లు గెలుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

కేసీఆర్ ఆశలు గాల్లో మేడలే.. కూలిపోవటం ఖాయం
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు, సీట్లపై స్పందించిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలలో వంద సీట్లలో ఓడిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు 95 నుంచి 105 సీట్లు వచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. కెసిఆర్ ఆశలు గాల్లో మేడల మాదిరిగా కూలిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుచు వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ సునామీ ఖాయం..
వికారాబాద్ జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం కేసీఆర్ రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ సునామీ ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. బిజేపి విజయాన్ని ఎవరు ఆపలేరు అని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. బిజెపిలో ఎవరూ అసంతృప్తితో లేరని పేర్కొన్న తరుణ్ చుగ్ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా వెంటిలేటర్ మీద ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ బీ టీమ్ గా పని చేస్తోందని తరుణ్ చుగ్ విమర్శించారు.

కేసీఆర్ కుటుంబంపై తరుణ్ చుగ్ తీవ్ర వ్యాఖ్యలు
కెసిఆర్ కుటుంబంలో ఒక విభాగానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు వారంతా దోచుకోవడానికి ఆలోచన చేస్తుంటారని తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఫోర్ ట్వంటీ లే ఉన్నారండి మండిపడిన తరుణ్ చుగ్ తెలంగాణ వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయని అనుకుంటే బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే అంటూ విమర్శించారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ఆయన తెలిపారు.

ధాన్యం సేకరణపై కేసీఆర్ పాలసీ ఏంటి? తరుణ్ చుగ్
మరోవైపు ధాన్యం సేకరణపై కెసిఆర్ పాలసీ ఏంటి అని ప్రశ్నించిన తరుణ్ చుగ్ బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం అని వెల్లడించారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు . సీఎం కేసీఆర్ గురించి అందరికీ తెలుసు అని ఎద్దేవా చేసిన తరుణ్ చుగ్ చాలా మంది టిఆర్ఎస్ నేతలు ఎప్పుడెప్పుడు పార్టీని వీడుదామా అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
ఏ గ్రామానికి వెళ్లినా ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని చెబుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. రైతులు, యువకులు, మహిళలు, దళితులు అందరూ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని కెసిఆర్ ప్రభుత్వ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని తరుణ్ చుగ్ విమర్శించారు.












Click it and Unblock the Notifications