Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణపై బీజేపీ అగ్రనేతల ఆశలు.. స్పష్టంగా చెప్పిన అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!!

తెలంగాణ రాష్ట్రం పై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధానికి ఇది ఒక కారణమా? తెలంగాణా రాష్ట్రంలో అధికారంపై బీజేపీ హైకమాండ్ బోలెడు ఆశలు పెట్టుకుందా? తెలంగాణ రాష్ట్రంపై ఈ క్రమంలోనే అమిత్ షా దృష్టి సారించారా? అంటే తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అవును అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది.

తెలంగాణాలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే... అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణాలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే... అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో బిజెపి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా తేల్చిచెప్పారు.

తెలంగాణ ప్రజల నాడి తమకు తెలుసని వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారం చేపడుతుందని పేర్కొన్న అమిత్ షా ఒక జాతీయ మీడియాకు సంబంధించిన సమ్మిట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

తెలంగాణా ప్రజల పల్స్ మాకు తెలుసు.. అమిత్ షా ధీమా

తెలంగాణా ప్రజల పల్స్ మాకు తెలుసు.. అమిత్ షా ధీమా

ఇంకా అమిత్ షా ఏమన్నారంటే తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గాలి బలంగా వీస్తోంది అని పేర్కొన్న అమిత్ షా వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో విజయ ఢంకా మోగిస్తామని స్పష్టం చేశారు. తాను తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి మరీ బీజేపీని గెలిపిస్తానని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణా రాష్ట్రంపై బీజేపీ అగ్రనేతల ఆశలు .. పార్టీలో దిద్దుబాటు చర్యలు

తెలంగాణా రాష్ట్రంపై బీజేపీ అగ్రనేతల ఆశలు .. పార్టీలో దిద్దుబాటు చర్యలు

అమిత్ షా తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రం పై బీజేపీ అగ్రనేతలు ఏ మేరకు ఆశలు పెట్టుకున్నారో అర్థమవుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అమిత్ షా వివిధ సర్వే సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

ఇక తీసుకోవలసిన చర్యలను కూడా నిర్దేశించుకుని కీలకంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి తదనుగుణంగా దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి నాయకులకు కూడా క్షేత్ర స్థాయిలోకి ఎలా వెళ్ళాలి అన్నదానిపై శిక్షణా తరగతులను నిర్వహించారు.

టీఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో గట్టిగానే తలపడనున్న బీజేపీ

టీఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో గట్టిగానే తలపడనున్న బీజేపీ

ఈ క్రమంలోనే తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంపై బిజెపి హై కమాండ్ ఎన్ని ఆశలు పెట్టుకుందో చెప్పకనే చెబుతుంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలలో మాత్రం బిజెపి తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో గట్టిగానే ఢీ కొట్టటానికి రెడీ అవుతున్నట్టు తాజాగా అమిత్ షా వ్యాఖ్యలు మరోమారు స్పష్టం చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+