బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్: జిల్లాలలోనూ సాలుదొర.. సెలవుదొర; రాష్ట్రవ్యాప్తంగా రచ్చ షురూ!!

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇచ్చిన జోష్ తెలంగాణ బీజేపీ లో స్పష్టంగా కనిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ దూకుడు పెంచడానికి బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పై అన్ని వైపు నుంచి దాడి చేసి ఊపిరాడనివ్వకుండా చేయాలని బిజెపి అధినాయకత్వం స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేయడంతో బండి సంజయ్ సారథ్యంలో బిజెపి నేతలు రంగంలోకి దిగుతున్నారు.

టీఆర్ఎస్ బీజేపీ ల మధ్య సాలు దొర సెలవు దొర రచ్చ

టీఆర్ఎస్ బీజేపీ ల మధ్య సాలు దొర సెలవు దొర రచ్చ


ఇప్పటివరకు సాలు దొర సెలవు దొర అంటూ బిజెపి కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డ్ పెట్టిన బిజెపి నాయకులు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో సాలు దొర సెలవు దొర డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. హైదరాబాద్ లోనే బీజేపీ కార్యాలయం వద్ద సాలు దొర సెలవు దొర డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసి కల్వకుంట్ల కౌంట్ డౌన్ అంటూ బీజేపీ రోజులు లెక్కపెట్టటం టీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి కారణం అయ్యింది.

అన్ని జిల్లా కేంద్రాలలో సాలు దొర సెలవు దొర బోర్డులు

అన్ని జిల్లా కేంద్రాలలో సాలు దొర సెలవు దొర బోర్డులు

ఇక బిజెపి చేస్తున్న ఎటాక్ పై రివర్స్ ఎటాక్ చేస్తూ బై బై మోడీ అంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్న సమయంలో, దూకుడును మరింత పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో సాలు దొర సెలవు దొర డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాష్ట్ర రాజకీయాలలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మరింత రచ్చకు కారణం గా మారుతుంది అన్న భావన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్ లోనే కాదు అని జిల్లాలలోనూ ఆర్టీఐ దరఖాస్తుల వెల్లువ

హైదరాబాద్ లోనే కాదు అని జిల్లాలలోనూ ఆర్టీఐ దరఖాస్తుల వెల్లువ

అలాగే టిఆర్ఎస్ పార్టీ పై సమాచార హక్కు చట్టం కింద గత ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ మేనిఫెస్టో లో పెట్టిన అంశాలతోపాటు, వివిధ సందర్భాలలో కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు పురోగతిని, ప్రగతి భవన్ నిర్మాణం, వివిధ పత్రికలకు ఇచ్చిన ప్రకటనల లెక్కలను ఇవ్వాలని కోరుతూ ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల ద్వారా దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో బండి సంజయ్ 86 దరఖాస్తులను పెట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వెల్లువలా దరఖాస్తులు పెట్టాలని కెసిఆర్ ప్రభుత్వం పై ముప్పేట దాడి చేయాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.

 ఆపరేషన్ ఆకర్ష పై ఈటల రాజేందర్ ఫోకస్..

ఆపరేషన్ ఆకర్ష పై ఈటల రాజేందర్ ఫోకస్..


అంతేకాదు ఇక చేరికల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని, టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెడుతూ ఆ పార్టీలోని ముఖ్య నేతలను, ప్రజాక్షేత్రంలో మద్దతు ఉన్న నేతలను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని అధిష్టానం సూచించిన మేరకు, ఆపరేషన్ ఆకర్ష్ ని కూడా చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికలకు ముందు ఊహించని భారీ షాక్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులకు గాలం వేస్తూ వారిని బిజెపి పాట పట్టించే ప్రయత్నం లో ఇప్పటికే ఈటల రాజేందర్ ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేసీఆర్ పై వ్యతిరేక ప్రచారానికి బీజేపీ వ్యూహాలు

కేసీఆర్ పై వ్యతిరేక ప్రచారానికి బీజేపీ వ్యూహాలు


టీఆర్ఎస్ సర్కార్ కు ఊపిరి ఆడనివ్వని వ్యూహాలతో బీజేపీ అస్త్రాలను సందిస్తుంది. ఇక కేసీఆర్ వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియాని కూడా జోరుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల్లోకి ఎంత వ్యతిరేకత తీసుకువెళ్లగలిగితే అంత లాభిస్తుంది అన్న భావన వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం బిజెపి అనుసరిస్తున్న వ్యూహాలు వచ్చే ఎన్నికలలో అధికారం కట్టబెట్టడానికి ఏ మాత్రం ఉపయోగపడతాయి అన్నది ఆసక్తికర అంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+