BJP: రెండు రోజుల్లో బీజేపీ రెండో లిస్ట్.. తెలంగాణ నుంచి ఏడుగురు..!
బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 195 మందితో మొదటి జాబితా ప్రకటించిన కాషాయ పార్టీ.. త్వరలో రెండో జాబితా ప్రకటించనుంది. వచ్చే మూడు రోజులు్లో 100 నుంచి 150 మందితో రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో బీసీలు, మహిళలకు ప్రాధాన్య ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మల్కాజిగి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవి లత పోటీ చేయనున్నారు.
జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి భరత్, చెవేళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయనున్నారు. రెండో జాబితాలో తెలంగాణకు సంబంధించి ఏడుగురు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ,మెదక్ నుంచి రఘునందన్‌రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, నల్గొండ నుంచి శానం సైదిరెడ్డి, పెద్దపల్లి నుంటి గోమాస శ్రీనివాస్, వరంగల్ నుంచి కృష్ణ ప్రసాద్ పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

ఇక ఆదిలాబాద్ సీటుపై బీజేపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పేరు ను అధిష్ఠానం మొదటి లిస్ట్ లో ప్రకటించలేదు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత నగేష్ కమలం పార్టీలో చేరారు. దీంతో ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన బీజేపీ నేతలు రమేష్ రాథోడ్, రాథోడ్ బాపూరావ్ సహా పలువురు సోమవారం ఢిల్లీకి వెళ్లారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలను కలిశామని రమేష్ రాథోడ్ తెలిపారు.నగేష్ పార్టీలో చేరి 24 గంటలు కూడా కాకుండానే టికెట్ తనదే అని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు నియోజకవర్గంలో ఆదివాసీల కంటే లంబాడీలే ఎక్కువ ఉన్నారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications