ఇప్పుడే భయపడుతున్నారు: కేసీఆర్, ఎంఐఎంపై బండి సంజయ్, రాజా సింగ్ విమర్శలు
హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆరె మైసమ్మ ఆలయం దగ్గర నిర్వహించిన సభలో సంజయ్ మాట్లాడారు.
రెచ్చగొట్టడం స్టార్ట్ చేయకముందే టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు బండి సంజయ్. దేశం నుంచి ఎంఐఎం పార్టీని తరిమికొడుతామన్నారు. నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుని హిందువులకు పంచుతామన్నారు. 80% ఉన్న హిందువుల అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు బండిం సంజయ్. భాగ్యలక్ష్మీ అమ్మవారి పేరు మీదనే భాగ్యనగరంగా ఏర్పడిందని గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ వెనుక రహస్యం ఏంటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత నిజాం సమాధి దగ్గర మోకరిల్లాడుని విమర్శించారు. దేశద్రోహి పార్టీ నాయకుడు సవాల్ చేస్తే భయపడ్డ దద్దమ్మల పార్టీ టీఆర్‌ఎస్ అని చురకలు అంటించారు. ఒక్క కుటుంబం చేతిలో బంధీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తోందన్న బండి సంజయ్.. 111 జీవో రద్దు హామీని ఇప్పటివరకూ కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. 111 జీఓ పరిధిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కు ఫాంహౌస్ ఉందని ఆరోపించారు. 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే తమ లక్ష్యమన్నారు బండి సంజయ్.
మరోవైపు, బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రజా సంగ్రామ యాత్రలో మాట్లాడుతూ.. రెండేళ్లలో తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తుందన్నారు. కేసీఆర్ అబద్ధాల ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు. ఏపీలో జగన్ ప్రజా సమస్యలపై రివ్యూలు చేస్తుంటే ఇక్కడ కేసీఆర్ మాత్రం ప్రజలను కలవడం లేదని ఆరోపించారు. దళితబంధు పథకాన్ని మొదటగా ఎస్సీ నియోజకవర్గాల్లో అమలు చేయాలన్నారు. గోషామహల్‌కు రూ. 2 వేల కోట్ల నిధులు ఇస్తానంటే తాను కూడా రాజీనామా చేస్తానన్నారు. హుజురాబాద్ లో గెలిచేది డబ్బులు కాదు.. గెలిచేది ఈటల రాజేందర్ మాత్రమేనని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పది వేలు తీసుకుని బీజేపీకి ఓటు వేశారన్నారు. తెలంగాణను కేసీఆర్ మత్తుల తెలంగాణగా మార్చాడుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతలను పాకిస్థాన్ తరిమికొడతామన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం ఎంఐఎంకు అలవాటని రాజా సింగ్ విమర్శించారు.
Recommended Video
కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాలికి గాయమైంది. కార్యకర్తల తోపులాటలో సంజయ్ కింద పడిపోయారు. దీంతో ఆయన కుడి కాలికి స్వల్ప గాయమైంది. ఆదివారం(ఆగస్టు 29) హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ ప్రాంతంలో సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన్ను కలిసేందుకు పోటీ పడటంతో తోపులాట జరిగి... సంజయ్ అదుపు తప్పి కింద పడిపోయారు. వెంటనే వైద్యులను పిలిపించగా... కాలి గాయమైన చోట ప్లాస్టర్ వేశారు. సోమవారం(ఆగస్టు 30) ఉదయం వైద్యులు మరోసారి సంజయ్ కాలి గాయాన్ని పరిశీలించారు. అనంతరం సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications