2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నా: డీకే అరుణ, తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లంటే?
మహబూబ్‌నగర్:లోక్‌సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయానికి వచ్చారన్నారు మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. దేశం కోసం, ధర్మ కోసం అంటూ ఏకపక్షంగా ఓటర్లు బీజేపీకి ఓటేశారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అన్నారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు బీజేపీ కార్యకర్తలను చాలా మంది బెదిరించారని డీకే అరుణ ఆరోపించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదని , ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే తనకు ఓటర్లు ఓటేశారని తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయని చెప్పారు.

మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో విజయం బీజేపీదేనని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారన్నారు.నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని పార్టీలకు అతీతంగా చాలా మంది ఓటేశారని డీకే అరుణ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో 2-3 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని డీకే అరుణ విశ్వాసం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి 8 సార్లు జిల్లాకు వచ్చి ప్రచారం చేసినా.. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు యువతను భయపెట్టినా వారంతా బీజేపీవైపే నిలిచారని డీకే అరుణ తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. యువతోపాటు అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అండగా నిలిచారన్నారు. తెలంగాణలో బీజేపీకి 12 స్థానాల్లో విజయం సాధించబోతోందని డీకే అరుణ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications