తెలంగాణాకు వచ్చి బీఎల్ సంతోష్ షాకింగ్ హెచ్చరిక అంతర్యం ఇదేనా? బీఆర్ఎస్ కు చుక్కలేనా!!

ఎమ్మెల్యేల ఎరకేసులో అనుమానితులుగా నోటీసులు ఇచ్చిన బిజెపి నేత బిఎల్ సంతోష్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బిజెపి నాయకుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. ఆయనే తెలంగాణాకు వచ్చి మరీ హెచ్చరించి వెళ్ళటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఎమ్మెల్యేల ఎరకేసుపై బీఎల్ సంతోష్ షాకింగ్ కామెంట్స్

ఎమ్మెల్యేల ఎరకేసుపై బీఎల్ సంతోష్ షాకింగ్ కామెంట్స్

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక భూమిక ఉందని అనుమానిస్తూ సిట్ విచారణకు హాజరుకావాలని బి ఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన ఆయన, తనకు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. తాజాగా తెలంగాణలో పర్యటించిన ఆయన అనవసరంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేసి అప్రతిష్టపాలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. తనపై చేసిన అవాస్తవ ప్రచారానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తనపై ఆరోపణలు చేసిన వారు ముందు ముందు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని బి ఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఎల్ సంతోష్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ

బీఎల్ సంతోష్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ

హైదరాబాద్ సంపాదనను రాజకీయ అవసరాలకు దేశమంతా పంపుతున్నారని వ్యాఖ్యలు చేసిన బి ఎల్ సంతోష్ తెలంగాణలో అధికారం మాత్రమే బిజెపి ధ్యేయం కాదని, రాష్ట్రంలో అవినీతి నిర్మూలన బిజెపి లక్ష్యమని పేర్కొన్నారు. తాజాగా బి ఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతున్నాయి. గులాబీ బాస్ కెసిఆర్ తో పాటు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, సిట్ అధికారులు బీఎల్ సంతోష్ ని టార్గెట్ చేయాలని భావిస్తే, ఆయన నేరుగా రాష్ట్రానికి వచ్చి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటారు అంటూ వ్యాఖ్యలు చేయడం భవిష్యత్తు పరిణామాలకు సంకేతంగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

బీఆర్ఎస్, తెలంగాణా ప్రభుత్వానికి చుక్కలేనా?

బీఆర్ఎస్, తెలంగాణా ప్రభుత్వానికి చుక్కలేనా?


ఇప్పటికే ఎమ్మెల్యేల ఎర కేసులో సి.బి.ఐ రంగంలోకి దిగడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోపక్క ఈడీ విచారణ ఈ కేసులో కొనసాగుతుంది. దీంతో బి ఆర్ ఎస్ పార్టీ నేతలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో బీఆర్ఎస్ అగ్రనాయకులు కూడా అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేల ఎర కేసుతో బిజెపిని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తే అందుకు భిన్నంగా ఇప్పుడు ఈ టోటల్ వ్యవహారంలో బీఆర్ఎస్ నే ఇరకాటంలో పడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన బీఎల్ సంతోష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి, బి ఆర్ ఎస్ నాయకులకు చుక్కలు చూపించడానికి రెడీ అయినట్లుగా సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తుంది.

రాష్ట్రంలో ముందు ముందు దాడులు మరింత పెరుగుతాయా?

రాష్ట్రంలో ముందు ముందు దాడులు మరింత పెరుగుతాయా?

అంతేకాదు బి ఎల్ సంతోష్ మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ సంపదను రాజకీయ అవసరాలకు వాడుతున్నాడని ఆరోపిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలన ధ్యేయం అని చెప్పడం కూడా రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాలు బయటకు తీసుకురావడానికి బిజెపి సిద్ధమౌతుంది అన్న సంకేతాన్ని ఇస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఐటీ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు కొనసాగుతున్న వేళ వచ్చే ఎన్నికల లోపు కచ్చితంగా ఈ దాడులు ఉధృతి మరింత పెరుగుతుందని, బి ఆర్ ఎస్ పైన తీవ్రమైన ఒత్తిడి చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అన్న సంకేతం ఇస్తుంది. అంతకు మించి బీఎల్ సంతోష్ చెప్పినట్టు తీవ్రమైన పరిణామాలు ఇంకా ఏముంటాయి అన్న చర్చ జరుగుతుంది.

 తెలంగాణాకు వచ్చి హెచ్చరించి వెళ్ళిన బీఎల్ సంతోష్

తెలంగాణాకు వచ్చి హెచ్చరించి వెళ్ళిన బీఎల్ సంతోష్

మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన బిఎల్ సంతోష్ ను సిట్ అధికారులు కానీ, తెలంగాణ ప్రభుత్వం గానీ టార్గెట్ చేయలేకపోయారు. కనీసం ఆయన్ను టచ్ కూడా చెయ్యలేకపోయారు. కానీ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, పర్యవసానాలు ఎదుర్కోక తప్పదన్న హెచ్చరికలు జారీ చేసి మరీ వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+