పేలుడుతో ఉలిక్కిపడ్డ కరీంనగర్‌: వృద్ధుడికి తీవ్రగాయాలు(పిక్చర్స్)

కరీంనగర్: నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమీపంలో గురువారం మధ్యాహ్నం సంభవించిన భారీ విస్ఫోటనంతో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సంభవించిన పేలుడుతో స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఘటనపై పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు, హుటాహుటిన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో వృద్ధుడు మాట్లాడే పరిస్థితిలేక పూర్తి వివరాలు చెప్పలేకపోయాడు. పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్వాడ్ బృందాలను రంగంలోకి దింపి పేలుడు జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

స్థానికులను విచారించి ఘటనపై ఆధారాల కోసం ప్రయత్నించారు. ఓఎస్డీ సుబ్బారాయుడు, డీఎస్పీ రామారావు బాధితుడితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. గాయపడిన వృద్ధుడు తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన దుడ్డెన దుర్గయ్యగా గుర్తించిన పోలీసులు, ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కరీంనగర్‌లో పేలుడు

కరీంనగర్‌లో పేలుడు

కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమీపంలో గురువారం మధ్యాహ్నం సంభవించిన భారీ విస్ఫోటనంతో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కరీంనగర్‌లో పేలుడు

కరీంనగర్‌లో పేలుడు

మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సంభవించిన పేలుడుతో స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.

గాయపడిన వృద్ధుడు

గాయపడిన వృద్ధుడు

ఘటనపై పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు, హుటాహుటిన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు.

రక్తపు మరకలు

రక్తపు మరకలు

తీవ్రగాయాలు కావడంతో వృద్ధుడు మాట్లాడే పరిస్థితిలేక పూర్తి వివరాలు చెప్పలేకపోయాడు.

చికిత్స పొందుతున్న వృద్ధుడు

చికిత్స పొందుతున్న వృద్ధుడు

పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్వాడ్ బృందాలను రంగంలోకి దింపి పేలుడు జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

వైద్యుల పర్యవేక్షణలో బాధితున్ని సమాచారం కోసం ప్రశ్నించగా, వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చాననీ, తిరిగి వెళ్తున్న క్రమంలో కొత్తగా నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల గేటు వద్ద ప్లాస్టిక్ డబ్బా లాంటిది కన్పించిందనీ, దాన్ని తెరిచే ప్రయత్నంలో పేలిందని వివరించాడు.

బాధితుడి సమాచారంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి పేలుడు జరిగిన ప్రాంతంలో ప్లాస్టిక్ డబ్బా ముక్కలు, అందులోని పదార్థాలను సేకరించారు. జిల్లా కేంద్రంలో పేలుడు సంభవించిందని తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అదే సమయంలో జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, మేయర్ రవీందర్‌సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గాయపడిన దుర్గయ్యకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా కట్టుదిట్టం చేయాలని పోలీసులకు సూచించారు.

కాగా, గతంలో కరీంనగర్ బస్టాండ్‌లో సంభవించిన పేలుడు ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. నగరాన్ని లక్ష్యంగా చేసుకుని మరోసారి అసాంఘిక శక్తులు పేలుళ్లకు పాల్పడేందుకు ఏమైనా కుట్రలు చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధాన ఆస్పత్రి కావడంతో అక్కడికి భారీ సంఖ్యలో వచ్చే రోగులు, ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+