వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లిపాయలు అమ్ముకుంటున్న కండలవీరుడు..పట్టుదల ఉన్నా పేదరికమే శాపమైన బాడీ బిల్డర్ కథ!!

|
Google Oneindia TeluguNews

పేదరికం ఆ కండలవీరుడి పాలిట శాపమైంది. రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలలో ఆరు సార్లు ప్రథమ బహుమతి పొందిన వ్యక్తి ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అత్యంత ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఎంతోమంది సరైన గుర్తింపు లేక, ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్న పరిస్థితి అనేక సందర్భాలలో చూస్తున్నాం. తాజాగా బాడీ బిల్డింగ్ పోటీలలో రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వీధి వీధి తిరుగుతూ ఉల్లిపాయలు విక్రయించడం గురించి తెలిసిన వారందరినీ ఆవేదనకు గురి చేస్తోంది.

ఉల్లిపాయలు అమ్ముకుంటున్న బాడీ బిల్డర్

ఉల్లిపాయలు అమ్ముకుంటున్న బాడీ బిల్డర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తల్లాడ లక్ష్మీనారాయణ, రాధమ్మ దంపతులకు భద్రయ్య రెండో సంతానం. నిరుపేద కుటుంబానికి చెందిన భద్రయ్య చిన్నప్పటినుంచి రెక్కల కష్టంతో పెరిగాడు. అనారోగ్యంతో భద్రయ్య తల్లిదండ్రులు చనిపోవడంతో, అన్నా వదినలే అతని బరువు బాధ్యతలను చూసుకున్నారు. ఇక వారికి కూడా భారం కాకూడదని భావించిన భద్రయ్య సమోసాలు, ఐస్ క్రీములు, ఉల్లిపాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుండి ఆటలంటే ఆసక్తి కనబరిచిన భద్రయ్య బాడీ బిల్డింగ్ పై శ్రద్ధ పెంచుకొని ప్రతిరోజు ఉల్లిపాయలు విక్రయించిన తర్వాత జిమ్ కు వెళ్లి బాడీ బిల్డింగ్ చేయడం మొదలుపెట్టాడు.

 రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలలో ఆరుసార్లు ప్రథమ బహుమతి సాధించిన భద్రయ్య

రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలలో ఆరుసార్లు ప్రథమ బహుమతి సాధించిన భద్రయ్య

భద్రయ్య ఆసక్తిని చూసిన బాడీ బిల్డింగ్ కోచ్ అబ్దుల్ మన్నన్ తన సొంత జిమ్ లో ఉచితంగా భద్రయ్యకు శిక్షణ ఇచ్చాడు. భద్రయ్యకు ఉన్న ఆసక్తి, కోచ్ శిక్షణ, స్నేహితుల సహకారం వెరసి భద్రయ్య జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో తన సత్తా చాటాడు. రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలలో ఆరుసార్లు ప్రథమ బహుమతి, ఆపై హర్యానా, మణిపూర్ రాష్ట్రాలలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. అయితే భద్రయ్య అక్కడకు వెళ్ళేందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో పోటీలకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఈ సారి జరగబోయే జాతీయ, అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధమవుతున్నాడు.

 బాడీ బిల్డింగ్ అంటే ఈజీ టాస్క్ కాదు.. మంచి ఆహారం, ఖర్చుతో కూడుకున్న పని

బాడీ బిల్డింగ్ అంటే ఈజీ టాస్క్ కాదు.. మంచి ఆహారం, ఖర్చుతో కూడుకున్న పని

ఆటలు ఆడడం కంటే, బాడీ బిల్డింగ్ చేయడానికి విపరీతమైన శ్రమ చేయవలసి వస్తుంది. అంతేకాదు బాడీ బిల్డింగ్ చేసే వ్యక్తి తీసుకునే ఆహారానికి విపరీతమైన ఖర్చు వస్తుంది. వీరి ఆహారం కోసం నెలకు పది వేలకు పైగానే ఖర్చవుతుంది. జిమ్ ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన భద్రయ్య బాడీ బిల్డింగ్ చేయడానికి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక ఇబ్బందులు భద్రయ్యను బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్లకుండా చేస్తున్నాయి.

అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకు రెడీ అవుతున్న భద్రయ్య .. ప్రభుత్వ సహకారం కోసం ఎదురుచూపు

అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకు రెడీ అవుతున్న భద్రయ్య .. ప్రభుత్వ సహకారం కోసం ఎదురుచూపు

అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా భద్రయ్య అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనటం కోసం రెడీ అవుతున్నారు. కానీ ఆర్ధిక ఇబ్బందులే భద్రయ్యను వెనక్కు లాగుతున్నాయి. నిరుపేద కుటుంబం నుండి వచ్చి పట్టుదలతో బాడీ బిల్డింగ్ చేసి కండల వీరుడిగా రాణించాలి అనుకుంటున్న భద్రయ్య కు ప్రభుత్వం సహకరిస్తే, భద్రయ్య ప్రయత్నాలకు ఊతమిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఈ కండలవీరుడు రాణించే అవకాశం ఉంటుంది. తెలంగాణ సర్కారు ఆ దిశగా సహకారం అందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

English summary
Poverty is the curse of a body builder. A man named bhadraiah from bhadradri kottagudem district who won first prize six times in state-level bodybuilding competitions is now selling onions on roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X