ఎరుపును కెసిఆర్ భరించలేరు: కంటతడి పెట్టిన బొజ్జా తారకం
వరంగల్: ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ పైన ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం ఆదివారం నాడు స్పందించారు. ఎన్‌కౌంటర్ పైన ఆయన కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎన్‌కౌంటర్ చేసిన వాళ్లు అసలు మనుషులేనా, ఇది నరహంతక దుశ్చర్య అని మండిపడ్డారు. ఎన్ కౌంటర్ అంటే కేవలం హత్య చేయడమేనా అని కెసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీశరు. ఇది నరహంతక దుశ్చర్య అన్నారు.

ఎన్ కౌంటర్ చేస్తే మావోయిస్టులు భయపడతారనుకుంటే ప్రభుత్వానిది పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు.
కెసీఆర్ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు సిపిఎం ఐక్య ఉద్యమానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఎరుపును భరించే శక్తి కెసిఆర్‌కు లేదన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది ఎంతమాత్రం కాదన్నారు. ఈ ఘటనలో పోలీసులు కూడా చనిపోయి ఉంటే నిజంగానే ఎన్ కౌంటర్ అని ప్రజలు భావించేవారన్నారు.












Click it and Unblock the Notifications