బొల్లారం చిన్నారి హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. ఎందుకు చంపాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన బొల్లారం చిన్నారి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు విక్రమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విల్లా ఆర్కిడ్ గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్.. తనను ఉద్యోగం నుంచి తొలగించారనే కక్ష పెట్టుకుని డబ్బుల కోసం కిడ్నాప్ కు ప్లాన్ వేసినట్లు తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 10 న సాయంత్రం ఐదేళ్ల చిన్నారి ఆరులియా మోను కనిపించడం లేదంటూ ఫిర్యాదు రాగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజు రాత్రి 7 గంటల 45 నిమిషాల సమయంలో చిన్నారి కిడ్నాప్ అయినట్లు తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. రూ.20 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్ లో నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో భయపడిన చిన్నారి తల్లిదండ్రులు బొల్లారం స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా క్లబ్ హౌస్ సెల్లార్ లోని ఒక నీటి సంప్ లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోరెన్సిక్ బృందంలో ఆధారాలు సేకరించి నిందితుడు అదే విల్లాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న విక్రమ్ అని నిర్ధారించుకుని పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
అక్టోబర్ 10 న సెక్యూరిటీ గార్డ్ విక్రమ్.. క్లబ్ హౌస్ దగ్గర సైకిల్ తొక్కుకుంటున్న చిన్నారిని సెల్లార్ లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేశాడు. శరీరానికి పెద్ద రాయి కట్టి నీటి సంపులో పడేశాడు. మోజెస్ మృతి చెందిందని నిర్ధారించుకున్న అనంతరం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో సెల్లార్ నుంచి ఒక్కడే బయటకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి వెళ్లిపోయాడు.

అయితే చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ తో పాటు మరో ఇద్దరి పాత్రపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు విక్రమ్.. చిన్నారిని హతమార్చేందుకు మరో సెక్యూరిటీ గార్డుతో పాటు స్థానిక ఎలక్ట్రీషియన్ సహకారం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలాఉంటే ఐదేళ్ల చిన్నారి ఆరేలియాను చంపిన హంతకుడ్ని ఉరి తీయాలని కౌకూరు విల్లా ఆర్కిడ్స్ నివాసితులలు ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అతడిని ఉరి తీసి ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయాలని పోలీస్ కమిషనర్ ను విల్లా నివాసితులు కోరారు. ఈ మేరకు నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని సీపీ సుమతి వివరించారు.












Click it and Unblock the Notifications
