ఇవాంకాకు మోడీ విందు ఇచ్చినవేళ: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బాంబు బెదిరింపు..
హైదరాబాద్: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బాంబు బెదిరింపు వచ్చినట్లు బుధవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు. మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందు సందర్భంగా ఈ బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా పలువురు వీవీఐపీలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. విందు జరుగుతున్న సమయంలో బాంబు బెదిరింపుకు సంబంధించి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు దాడి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్యాలెస్ మొత్తాన్ని తనిఖీ చేసిన తర్వాత అలాంటిదేమి లేదని నిర్దారించారు. అగంతకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications