సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగివున్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగివున్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ బుధవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది.
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగివున్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ బుధవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. అయితే, ఫోన్ కాల్ వచ్చిన సమయంలో ఆ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే ఆగివుంది.
దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్, గోపాలపురం పోలీసులు, బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది రైలులో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబు లభించలేదని తెలిసింది. మరోవైపు, ఈ బాంబు బెదిరింపు కాల్ ఆకతాయిల పనేనని పోలీసులు ఆ తర్వాత తేల్చారు.

కాగా, ఇటీవల ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ పెరిగిపోయాయి. రెండు మూడు రోజుల క్రితం ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఓ ప్రయాణికుడు ఆలస్యం కావడంతో ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ చేయడం గమనార్హం. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.












Click it and Unblock the Notifications