బోనాల ఫీవర్ : నగరంలో ముక్కా.. చుక్కా..: వైన్ షాపులకు పోటెత్తిన జనం

Subscribe to Oneindia Telugu

ఐడీఏ బొల్లారం : మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకునే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఆచార సాంప్రదాయాల ప్రకారం చాలా వేడుకల్లో జంతు బలులు, పండగ పూట కాస్త మధ్యం సేవించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ప్రతీ పండుగలకు పబ్బాలకు మాంసం దుకాణాలతో పాటు వైన్ షాపులూ కిటకిటలాడుతుంటాయి.

ఇక తాజాగా బోనాల ఫీవర్ తో ఊగిపోతున్న నగరంలోను ఇదే పరిస్థితి నెలకొంది. బోనాలను పురస్కరించుకుని నగరంలోని వైన్ షాపులను మూసేయాల్సిందిగా అధికారులు ఆదేశివ్వడంతో.. మధ్యం ప్రియులంతా వైన్ షాపుల ముందు 'క్యూ' కట్టారు. అలాగే పండగ పూట మాంసం లేనిదే ముద్ద దిగదు కాబట్టి.. చాలా మంది జనాలు మాంసం షాపుల్లో మాంసం కొనుగోలు చేశారు.

Bonalu fever : Meat and wine shops are packed

ఈ నేపథ్యంలోనే ఐడీఏ బొల్లారం పరిధిలో బారులు తీరి మరీ మధ్యం బాటిళ్లను కొనుక్కు వెళ్లారు మధ్యం ప్రియులు. షాపు తెరవకముందే అక్కడ వాలిపోయిన జనాలు వైన్ షాపు తెరిచేదాక పడిగాపులు కాచి మొత్తానికి మధ్యం బాటిళ్లను కొనుక్కుని నవ్వులు చిందిస్తూ వెళ్లడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bonalu is an annual festival of telangana celebrrated in hyderabad. due to the festival all the wine and meat shops are fully packed with local people

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి