సందడిగా ముగిసిన బుక్ ఫెయిర్: 10లక్షల మంది సందర్శన(పిక్చర్స్)
హైదరాబాద్: పది రోజుల పాటు సాహితీ ప్రియులను అలరించిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ రెండో పుస్తక ప్రదర్శనను సొసైటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. 371 స్టాల్స్‌లో కొలువుదీరిన లక్షలాది పుస్తకాలను చూడడానికి నిత్యం వేలాది మంది తరలివచ్చారు.
పది రోజుల్లో దాదాపు 10 లక్షల మంది పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఆదివారం పుస్తక ప్రదర్శన చివరి రోజు కావడంతో జనం సందోహం భారీగా పెరిగింది. బుక్ ఫెయిర్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఇక్కడ గడిపారు. ఆఖరి గంట వరకు సందర్శకులు వస్తూనే ఉన్నారు. ఆదివారం హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ తిలకించారు.
డిసెంబర్ 18న ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శనకు సెలవురోజుల్లో అత్యధికమంది రావడం కన్పించింది. కవులు, రచయితలు, సాహితీప్రియులు, ఉన్నతాధికారులు, మంత్రులు, సినీనటులు, విద్యార్థులు, పాత్రికేయులు, చిన్నారులతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వరకు సందర్శించినవారిలో ఉన్నారు. చిన్నాపెద్దా లక్షలాది పుస్తకాలు అమ్ముడుపోయాయి. పుస్తకావిష్కరణలు, ప్రముఖుల అనుభవాలతో ఈ పదిరోజులూ సందడిగా సాగింది.

బుక్ ఫెయిర్
పది రోజుల పాటు సాహితీ ప్రియులను అలరించిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఆదివారంతో ముగిసింది.

బుక్ ఫెయిర్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ రెండో పుస్తక ప్రదర్శనను సొసైటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. 371 స్టాల్స్‌లో కొలువుదీరిన లక్షలాది పుస్తకాలను చూడడానికి నిత్యం వేలాది మంది తరలివచ్చారు.

బుక్ ఫెయిర్
పది రోజుల్లో దాదాపు 10 లక్షల మంది పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఆదివారం పుస్తక ప్రదర్శన చివరి రోజు కావడంతో జనం సందోహం భారీగా పెరిగింది.

బుక్ ఫెయిర్
బుక్ ఫెయిర్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఇక్కడ గడిపారు. ఆఖరి గంట వరకు సందర్శకులు వస్తూనే ఉన్నారు. ఆదివారం హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ తిలకించారు.

బుక్ ఫెయిర్
డిసెంబర్ 18న ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శనకు సెలవురోజుల్లో అత్యధికమంది రావడం కన్పించింది.

బుక్ ఫెయిర్
కవులు, రచయితలు, సాహితీప్రియులు, ఉన్నతాధికారులు, మంత్రులు, సినీనటులు, విద్యార్థులు, పాత్రికేయులు, చిన్నారులతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వరకు సందర్శించినవారిలో ఉన్నారు. చిన్నాపెద్దా లక్షలాది పుస్తకాలు అమ్ముడుపోయాయి.

బుక్ ఫెయిర్
పుస్తకావిష్కరణలు, ప్రముఖుల అనుభవాలతో ఈ పదిరోజులూ సందడిగా సాగింది.

బుక్ ఫెయిర్
స్టాల్ నిర్వాహకులు గతం కంటే అత్యధికంగా పుస్తకాల్ని విక్రయించినట్లు తెలిపారు.

బుక్ ఫెయిర్
ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. పుస్తక ప్రదర్శన నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

బుక్ ఫెయిర్
ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ.. అయుత చండీయాగం లాంటి యజ్ఞం పుస్తక ప్రదర్శనలో జరుగుతోందన్నారు.

బుక్ ఫెయిర్
టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో పఠనాసక్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

బుక్ ఫెయిర్
పుస్తకం అందించే జ్ఞానం గొప్పదని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎల్లూరి శివారెడ్డి అన్నారు.

బుక్ ఫెయిర్
ఈ సందర్భంగా బుక్ ఫెయిర్‌లో ఉత్తమ స్టాల్ నిర్వాహకులకు బహుమతులు అందజేశారు.

బుక్ ఫెయిర్
బెస్ట్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టాల్‌గా హరియంత్ ప్రకాశన్, ద్వితీయ స్టాల్‌గా ఆక్స్‌ఫర్డ్ స్టాల్స్ బహుమతి పొందగా, తెలుగు స్టాల్స్‌లో మొదటి బహుమతిని తెలుగు అకాడమీ, ద్వితీయ స్థానాన్ని ఎమెస్కో, పుస్తకేతర స్టాల్స్‌లో మొదటి బహుమతిని ఫిలెక్స్ సిస్టమ్స్, ద్వితీయ బహుమతిని మహాగీత మ్యూజిక్ స్టాల్స్ పొందాయి.

బుక్ ఫెయిర్
ఈ సందర్భంగా 2014 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పుసస్కార గ్రహీత పసునూరి రవీందర్, బాలసాహిత్యం పురస్కార గ్రహీత దాసరి వెంకట రమణను సత్కరించారు.

బుక్ ఫెయిర్
బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి చంద్రమోహన్, ఎమెస్కో విజయ్, పత్తిపాక మోహన్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications