వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో పుట్టారు.!అంతర్జాతీయ కంపెనీలకు సీఈవోలుగా ఎదిగారు.!కేటీఆర్ ట్వీట్ లో మర్మం అదేనా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ కు కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియామకంపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ టెక్నికల్ కంపెనీలకు సీఈవోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయులపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అదే పరంపరలో పరాగ్ అగర్వాల్ కు శుభాకాంక్షలతో పాటు నర్మగర్బ సందేశాన్ని కూడా అందించారు కేటీఆర్. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మాతృదేశాన్ని గుర్తుంచుకోవలి.. కేటీఆర్ ట్వీట్ లో నిగూఢార్థం

మాతృదేశాన్ని గుర్తుంచుకోవలి.. కేటీఆర్ ట్వీట్ లో నిగూఢార్థం

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ నూతన సీఈవోగా భారత జనరేషన్ కి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో జాక్ డోర్సే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ పదవికి పరాగ్ ఎంపికయ్యకరు. ప్రపంచ టాప్ టెక్నికల్ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్ అగర్వాల్ కూడా చేరారు. అంతర్జాతీయ టెక్నికల్ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం, ట్విటర్‌, మైక్రాన్‌, మాస్టర్‌ కార్డ్‌ సంస్థలను భారత సంతతికి చెందిన భారతీయులు నడిపిస్తుండడం విశేషం. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చనియాంశమవుతోంది.

పరాగ్ అగర్వాల్ కు కేటీఆర్ శుభాకాంక్షలు.. శుభాకాంక్షల వెనక సందేశం

పరాగ్ అగర్వాల్ కు కేటీఆర్ శుభాకాంక్షలు.. శుభాకాంక్షల వెనక సందేశం

ప్రపంచంలో టాప్ కంపెనీలను లీడ్ చేస్తున్న భారతీయులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం, ట్విటర్‌, మైక్రాన్‌, మాస్టర్‌ కార్డ్‌ సంస్థల్లో ఒక సాధారణ అంశం దాగుందని ట్వీట్ చేశారు. భారత్‌లో ఉన్నత చదువులు చదివిన వ్యక్తులే ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు సీఈవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. భారతీయులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా పరాగ్‌ అగర్వాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయ సీఈవోలు.. భారత్ కు మేలు జరిగేనా.?

భారతీయ సీఈవోలు.. భారత్ కు మేలు జరిగేనా.?

మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెళ్ల కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గూగుల్‌ సీఈవోగా తమిళనాడుకు చెందిన సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈఓగా హైదరాబాద్‌కి చెందిన శంతను నారాయణ్, ఐబీఎం సీఈవోగా ఏపీకి చెందిన అరవింద్ కృష్ణ సేవలు అందిస్తున్నారు. మైక్రాన్‌ టెక్నాలజీ సీఈవోగా కాన్పూర్‌కి చెందిన సంజయ్ మెహ్రోత్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పుణెకి చెందిన అజయ్‌ బంగా మాస్టర్‌ కార్డ్‌ భారత్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. వీరందరినీ దృష్టిలో ఉంచుకుని పరాగ్ అగర్వాల్ కు శుభాకాంక్షలు చెప్తూనే సున్నితంగా చురకలంటిచారు మంత్రి కేటీఆర్.

భారత్ లో పెరిగారు.. మాతృభూమి రుణం తీర్చుకోవాలనే కోణంలో కేటీఆర్ ట్వీట్

భారత్ లో పెరిగారు.. మాతృభూమి రుణం తీర్చుకోవాలనే కోణంలో కేటీఆర్ ట్వీట్

ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలకు సీఈవోలుగా కీలక బాద్యతలు నిర్వహిస్తున్న వారిని కేటీఆర్ ట్వట్టర్ లో అభినందించారు. కాగా భారత్ లో పుట్టి పెరిగి అనే పదాన్ని నొక్కి వక్కాణించారు మంత్రి కేటీఆర్. భారత్ లో విద్యబుద్దులు నేర్చుకుని ఆస్థాయికి వెళ్లినప్పుడు మాతృదేశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా అనే కోణంలో ట్వీట్ చేసారు. కేటీఆర్ ట్వీట్ లో కాస్త అసహనం, అసంతృప్తి, ఒక రకమైన మేలుకొలుపు, జన్మభూమి పట్ల మమకారం, ఆ స్థాయికి వెళ్లినా కూడా సొంత దేశానికి ఏంచేయరా అనే ప్రశ్నను సంధించే కోణంలో ట్వీట్ ఉందని చర్చ జరుగుతోంది. ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు గాంచిన విశిష్ట అంతర్జాతీయ కంపెనీల్లో సీఈవోలుగా కీలక పదవుల్లో ఉన్నప్పటికి దేశానికి ఏమీ చేయనప్పుడు ఎంటి ప్రయోజనం అనే రీతిలో కేటీఆర్ ట్వీట్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కేటీఆర్ ట్వీట్ దేశ భక్తితో పాటు సందేశాత్మకంగా ఉందని చర్చ జరుగుతోంది.

English summary
KTR also sent a message of congratulations to the new CEO of Twitter Parag Agarwal. There is an interesting discussion going on about the tweet made by KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X