• search
  • Live TV
మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘సాఫ్ట్‌’గా హ్యాండిచ్చిన సాఫ్ట్‌వేర్‌ ప్రియుడు.. 3 రోజులుగా ప్రియురాలి ధర్నా

|
Google Oneindia TeluguNews

దేవరకద్ర : ఫుల్లుగా నమ్మింది. పీకలోతు ప్రేమలో మునిగిపోయింది. పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడి మాటలు నమ్మి సహజీవనం కూడా చేసింది. అంతేకాదు అతగాడి చదువు కోసం ఆర్థిక సాయం కూడా చేసింది. అంతా సజావుగా సాగుతుందని ఆ ప్రేమికురాలు గుడ్డిగా నమ్మింది. కానీ కన్నింగ్ బుద్ధితో రెండో కోణమున్న ప్రియుడు ఆమె బారి నుంచి ఎలా తప్పించుకోవాలబ్బా అంటూ స్కెచ్చేశాడు. చివరకు అలాగే చేశాడు. పెళ్లి మాట ఎత్తేసరికి సీన్ రివర్సయింది. దాంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ ప్రేమికురాలు ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.

<strong>పెద్దలు ఒప్పుకోలేదు..! ప్రేమ ఇద్దరి ప్రాణాలు తీసింది</strong>పెద్దలు ఒప్పుకోలేదు..! ప్రేమ ఇద్దరి ప్రాణాలు తీసింది

 ఆరేళ్ల ప్రేమ.. పెళ్లి మాటేత్తెసరికి..!

ఆరేళ్ల ప్రేమ.. పెళ్లి మాటేత్తెసరికి..!

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో.. ప్రేమికురాలు ధర్నాకు దిగింది. మద్దూర్ గ్రామానికి చెందిన జుట్ల నర్మద, చిన్నచింతకుంటకు చెందిన మక్క మోహన్ కుమార్ పరస్పరం ప్రేమించుకున్నారు. ప్రియుడు తనను మోసగించాడనే కారణంతో అతడి ఇంటి ఎదుట మూడు రోజులుగా దీక్ష చేస్తోంది నర్మద. ఆరేళ్లుగా ఒకరినొకరం ప్రేమించుకున్నామని.. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి మాట మార్చుతున్నాడనేది ఆమె వెర్షన్.

ప్రియురాలి డబ్బులతో ఉన్నత చదువులు..!

ప్రియురాలి డబ్బులతో ఉన్నత చదువులు..!

ప్రేమ కొనసాగుతున్న సమయంలోనే ఇద్దరు ఉన్నత విద్య కోసం పట్నం బాట పట్టారు. ఆ క్రమంలో 2010 నుంచి 2014 వరకు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసింది నర్మద. మోహన్ కుమార్ డిగ్రీ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నర్మద ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బులు దాదాపు లక్షన్నర వరకు మోహన్ చదువుల కోసం ఖర్చు పెట్టిందట.

అదలావుంటే 2014లో ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేసిన నర్మద.. మోహన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది. వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే 2014 నుంచి ఇప్పటివరకు వీరిద్దరు కలిసి సహజీవనం కొనసాగించారు. ఆ క్రమంలో ఎన్నిసార్లు పెళ్లి మాట ఎత్తినా తప్పించుకునేవాడట. మా చెల్లెలి పెళ్లి తర్వాత చూద్దాంలే అంటూ దాటవేసేవాడట. అయితే అతని చెల్లెలి పెళ్లి అయిపోయినా కూడా వీరి పెళ్లి మాత్రం అలాగే పెండింగ్ లో పెట్టాడు.

అమ్మ చనిపోతానంటోంది.. అందుకే నువ్వొద్దు..!

అమ్మ చనిపోతానంటోంది.. అందుకే నువ్వొద్దు..!

చివరకు ఆరు నెలల కిందట ఇరు గ్రామాలకు చెందిన పెద్దల సమక్షంలో వీరిద్దరి పెళ్లికి అంగీకారం కుదిరింది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నర్మద ప్రెజర్ పెట్టడంతో మోహన్ మాట మార్చాడట. తనను పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతానని అంటున్నందున కుదరదని చెప్పేశాడట.

ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా

ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా

మోహన్ కుమార్ పెళ్లి గురించి దాటవేస్తున్నాడంటే తనను మోసగిస్తున్నాడనే విషయం గ్రహించి.. కొద్ది రోజుల కిందట జిల్లా ఎస్పీని కలిసింది. లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్న ఎస్పీ ఫిర్యాదు మేరకు.. 3 రోజుల కిందట పోలీసులను ఆశ్రయించింది. తన ప్రేమ పెళ్లి విషయంలో అక్కడ కూడా జాప్యం జరుగుతుండటంతో చివరకు ప్రియుడి ఇంటి ఎదుట మూడు రోజులుగా ధర్నా చేస్తోంది. న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తానని అంటోంది.

English summary
Believed as FULL. The fallen love drowned. She also helped financial aid for her lover's education. But the boyfriend cheated her and thinking for how to escape from her clutches. And finally did that. The girl friend, who realized that she was deceived, finally she protest for marriage infront of boyfriend's house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X