నేటి నుంచి ఈ నెల 21 వ‌ర‌కు యాదగిరీశుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల‌లో ఒక‌టి యాదగిరిగుట్ట. ఈ ఆల‌యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ స్వామివారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల బాధ‌లు తొల‌గుతాయ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. అందుకే నిత్యం ఈ పుణ్య‌క్షేత్రానికి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. నిత్యం పూజ‌ల‌తో ఈ ఆల‌యం ఎంతో సంద‌డిగా ఉంటుంది. ఈ ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రంలో నేటి నుంచి స్వామివారి రెండ‌వ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి.

ఈ బ్ర‌హ్మోత్స‌వాలు మొత్తం ప‌ద‌కొండురోజుల‌పాటు నిర్వ‌హిస్తారు. ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా ఈ బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం అయ్యాయి. ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవ సారి వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముస్తాబయింది. నేటి నుంచి ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఇవాళ విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం మొదలయ్యాయి. నేటినుంచి ఈ నెల 21వ‌ర‌కు ఈ బ్ర‌హ్మోత్స‌వాలు ఉంటాయి. చివ‌రి రోజున శృంగార డోలోత్సవంతో ఉత్సవాలను ముగిస్తారు. మార్చి 12వ తేదీన అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం కార్య‌క్ర‌మాలు ఉంటాయి. ఇక ఎల్లుండి అంటే మార్చి 13వ తేదీన‌ ఉదయం మత్స్య అలంకారం, సాయంత్రం శేష వాహనం సేవలు నిర్వహిస్తున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు.

Brahmotsavam of Yadagiri will start from today till 21st of this month

బ్ర‌హ్మోత్స‌వ కార్య‌క్ర‌మ వివ‌రాలు...

మార్చి 14 న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ కార్య‌క్ర‌మాలు ఉంటాయి. ఇక‌, మార్చి 15 ఉదయం మురళీ కృష్ణుడి అలంకారం, రాత్రి పొన్న వాహన సేవమార్చి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. మార్చి 16న -ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహవాహన సేవ నిర్వహిస్తారు. మార్చి 17న స్వామివారి ఎదుర్కోలు, 18న తిరుకల్యాణ మహోత్సవం, 19న దివ్యవిమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చత్రతీర్థం, 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవం నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మాల‌ను ముందుగా ర‌ద్దు చేశారు. అందులో ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేయ‌డం జ‌రిగింది. ఇక‌, ఇప్ప‌టికే బ్ర‌హ్మోత్స‌వాలు ఏర్పాట్లను ఆలయ అధికారులు ఎంతో వైభవంగా చేశారు. ఈ ఉత్స‌వాల్లో పాల్గొనేందుకు భ‌క్తుల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను కూడా న‌డుపుతున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ప్రధానాలయ ముఖ మంటపం, హనుమాన్ టెంపుల్, ఆండాళ్ అమ్మవారి ఆలయాలకు లైటింగ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇక‌, ఆల‌యంలోని సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్‌ను కూడా పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+