కేసీఆర్ వన్స్ అగైన్.. అప్పుడే పీక్స్ లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం!!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నిన్న ఎన్నికల షెడ్యూల్ రావడంతో అప్పుడే ఎన్నికల క్షేత్రంలోకి దిగారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ఎన్నికలలో యూత్ ను, వివిధ వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను విపరీతంగా వాడుకోవాలని నిర్ణయించిన కేసీఆర్ ఆ పని మొదలుపెట్టారు.
రకరకాల కార్టూన్లతో, వీడియోలతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లలో ప్రతిపక్షపార్టీలను టార్గెట్ చేస్తుంది. ప్రజా సంక్షేమం కోసం తాము చేస్తున్నటువంటి పనులను లబ్ధిదారుల చేత చెప్పించి, మళ్లీ కేసీఆర్ ను గెలిపిద్దాం అని ప్రమోషన్ మొదలుపెట్టింది బి ఆర్ ఎస్. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలతో కెసిఆర్ వన్స్ అగైన్ అంటూ కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలి అంటూ అప్పుడే హోరెత్తిస్తుంది.

పేదలకు, రైతులకు, మహిళలకు, ప్రజలందరికీ మంచి చేస్తున్న పథకాలను సముద్రంలో కలుపుతామంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో సమాధి చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాల కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దాం... బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిద్దాం అంటూ కార్టూన్ ద్వారా కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది.
అప్పటికి ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని తేడాను చూపుతూ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలను పోస్ట్ చేస్తూ, రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందో చెబుతోంది. రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. సంక్షేమ మంత్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఈసారి ఎన్నికల్లో కూడా విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందే ఓ రేంజ్ లో పబ్లిసిటీ మొదలుపెట్టింది బి ఆర్ ఎస్. ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులలో పార్టీని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జరిగే పరిణామాలను కళ్ళకు కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేసీఆర్ ను మాత్రమే గెలిపించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తుంది బి ఆర్ ఎస్.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications